వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం ఓ సైకో: అదృశ్యమైన ఆ ఇద్దర్నీ చంపేశాడా, దినేష్ రెడ్డి వద్ద సీక్రెట్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అన్ని కోణాల్లోను విచారణ జరుపుతోంది. నయీంతో పలువురు పోలీసు అధికారులు, మాజీ మంత్రులు, అధికార పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వారు ఖండించడం కూడా జరుగుతోంది.

కాగా, శనివారం నాడు ఒక్కరోజే దాదాపు అరవై మంది నయీం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు, పోలీసుల విచారణలో నయీం ఓ సైకోలా ప్రవర్తించేవాడని వెల్లడైన విషయం తెలిసిందే. చిన్నారుల పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో ఫర్హాన్, అప్షా వెల్లడించారు.

నయీం ఇచ్చే నిద్రమాత్రల మోతాదు ఎక్కువ కావడంతో ఓ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆ చిన్నారని నయీం బయటకు తీసుకు వెళ్లాడని, ఆ తర్వాత చిన్నారి ఆచూకీ దొరకలేదని వారు విచారణలో వెల్లడించారు. చిన్నారులపై నయీం వేధింపులను ప్రశ్నించినందుకు ఫర్హానాకు నయీం గ్యాంగ్ గుండు గీయించినట్లుగా విచారణలో వెల్లడించారు.

గగన్ పహాడ్‌లో నివాసం ఉన్న సమయంలో నయీం వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి నయీం పద్ధతులు నచ్చక ఉద్యోగం మానేస్తానని చెప్పాడు. దీంతో అతనిని కిరాతకంగా హత్య చేశాడని, డ్రైవర్ మృతదేహాన్ని నల్గొండ జిల్లా కోదాడకు తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టాడని చెప్పారు.

ఆ ఇద్దరు హత్యకు గురయ్యారా?

రెండేళ్ల క్రితం అలీమ్ అనే వ్యక్తి భార్య హీనా, కూతురు చియాన్ అదృశ్యమయ్యారు. రెండేళ్లుగా వారు కనిపించడం లేదు. వారు నయీం చేతిలో హత్యకు గురయి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది. కాగా, పోలీసులు నగరంలో ఇరవై ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నయీం

నయీం

గ్యాంగ్ స్టర్ నయీం కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అన్ని కోణాల్లోను విచారణ జరుపుతోంది. నయీంతో పలువురు పోలీసు అధికారులు, మాజీ మంత్రులు, అధికార పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వారు ఖండించడం కూడా జరుగుతోంది.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

నయీంతో ఓ మాజీ డీజీపీకి సంబంధాలు ఉన్నాయని, ఆయన దినేష్ రెడ్డి అని ప్రచారం జరిగిన నేపథ్యంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి శనివారం వివరణ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు నయీంతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నయీం ఇష్యూపై సీఎం కేసీఆర్‌కు కితాబిచ్చారు.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. గ్యాంగ్ స్టర్ నయీంను పట్టుకునేందుకు సీఎం కేసీఆర్ పోలీసులను ఆదేశించడం అభినందించదగ్గ విషయమన్నారు. గత ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. తన వద్ద సెన్సిటివ్ సమాచారం ఉందని, దానిని సీఎం సీఎం కేసీఆర్ చెప్పేందుకు అపాయింటుమెంట్ కోరానని ఆయన చెప్పారని తెలుస్తోంది.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి ఓ హోటల్‌ను ఎంచుకున్నారు. తొలుత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు దినేశ్ రెడ్డి మీడియాకు ఆహ్వానం పంపారు. చివరి నిమిషంలో మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు దినేశ్ రెడ్డి నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. బీజేపీ కార్యాలయంలో ఏసీ బాగా లేకపోవడం వల్లనే అక్కడ ఏర్పాటు చేయలేదని చెప్పారు.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

నయీం కేసును సిట్ నిక్షప్తపాతంగా దర్యాప్తు జరుపుతోందని, ప్రజల మాన, ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులపై ఉందని, నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీం కేసు వెనుకున్న వారందరినీ బయటకు తేవాలని అన్నారు.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

మాజీ డీజీపీ అంటూ తనపై పరోక్షంగా ఆరోపణలు చేశారని ఓ ఛానెల్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా అందులోనూ ప్రత్యేకించి ఓ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్నట్లు నయీంకు మాజీ డీజీపీతో సంబంధాలున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది డీజీపీల్లో నేనూ ఒకడినని అన్నారు. మాజీ డీజీపీపై ఆరోణపలు వచ్చిన క్రమంలో వివరణ ఇవ్వడం నా బాధ్యత అని చెప్పారు. నయీంను అంతమొందించడం మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

దినేష్ రెడ్డి

దినేష్ రెడ్డి

ఈ విషయంలో పోలీసులకు అభినందనలు తెలిపారు. నయీంను చంపడం మంచిదేనని అన్నారు. నయీం ఎన్ కౌంటర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సలాం కొట్టారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టులను పోలీసు ఇన్ ఫార్మర్లుగా వాడుకోవడం సహజమేనన్నారు. ఏ డీజీపీ స్థాయి అధికారికి గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు ఉండవని అన్నారు. తనతో పాటే డీజీపీగా పనిచేసిన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా నయీమ్ తో సంబంధాలు ఉండే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.

English summary
The SIT probing gangster Nayeem linked cases is investigating the murders of four people belonging to Nayeem’s family including a child, who were allegedly killed by Nayeem and his gang. The police have also found 20 more dens of Nayeem, with hidden loot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X