మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయీమ్ చూట్టూ ‘గడాఫీ’సైన్యం, అదే వ్యూహం: ‘ఎర’గా అమ్మాయిలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం అతని గురించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్కలేని అక్రమాస్తులు, హత్యలు, అమ్మాయిల అక్రమ రవాణా లాంటివెన్నో వెలుగుచూస్తున్నాయి. అయితే, తన రక్షణ కోసం నయీమ్ ఎక్కడా రాజీ పడనట్లే తెలుస్తోంది. ఎందుకంటే అతని చుట్టూ ఎప్పుడూ గడాఫీ లాంటి సైన్యం ఉంటుంది. అయితే, ఎన్ కౌంటర్ సమయంలో మాత్రం అతను ఒంటరిగానే దొరికపోవడం గమనార్హం.

కాగా, నయీమ్ తన రక్షణ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. లిబియా నియంత గడాఫీ అంతటి వ్యూహాత్మక రక్షణను ఏర్పరచుకున్నాడు. గడాఫీ తరహాలోనే తనకు రక్షణ కవచంగా మహిళలను, యువతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆయుధాల వినియోగంలోనూ పూర్తి శిక్షణ ఇప్పించాడు. అవసరమైన సందర్భాల్లో వారి 'శరీరాలనూ' వినియోగించుకున్నాడు.

అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే... నయీమ్ ఇంట్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఫర్హానా వంట మనిషిగా పనిచేస్తోంది.

అదే పట్టణానికి చెందిన అమీర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య అఫ్సానా అలియాస్ ఇన్షియాద్ నయీమ్ ఇంట్లోనే ఉండేది. వారిద్దరూ నయీమ్‌కు నమ్మినబంట్లు కావడంతో ఆత్మరక్షణ, తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చాడు. వారికి అత్యాధునిక పిస్టళ్లు, తూటాలు అందజేసి.. భార్య, పిల్లలతో పాటు ఇంటి వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించాడు.

ఆయుధాలతో పాటు స్థలాల డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, నగదును కూడా వారి సమక్షంలోనే ఇంట్లో దాచేవాడు. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు దాడి చేసిన సమయంలో ఫర్హానా, అఫ్సానా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. హ్యాండ్ బ్యాగుల్లో పిస్టళ్లు, తూటాలు దొరికాయి.

కాగా, అల్కాపురిలోని ఇంట్లో ఉన్న వంట గదుల్లో వంట చేసిన ఆనవాళ్లేమీ లేవని పోలీసులు చెబుతున్నారు. నిత్యం హోటళ్ళ నుంచి తెచ్చుకుని తినేవారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను కూడా రక్షణ కోసమే వినియోగించారని భావిస్తున్నారు.

నయీమ్ ఆగడాలు

నయీమ్ ఆగడాలు

నయీమ్ నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి ఆడపిల్లల్ని డబ్బు చెల్లించి తీసుకువచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నయీమ్ ఆగడాలు

నయీమ్ ఆగడాలు

వారితో పాటు చిన్న వయసులోనే భర్త చనిపోయిన, అనాథలుగా మారిన వారిని కూడా ఆశ్రయం కల్పిస్తామంటూ తీసుకువచ్చి కొందరు బంధువులు నయీమ్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది.

నయీమ్ ఆగడాలు

నయీమ్ ఆగడాలు

సోమవారం నయీమ్ ఇంట్లో పట్టుబడిన ఐదుగురు ఆడపిల్లలూ ఇలానే అక్కడికి చేరి ఉంటారని భావిస్తున్నారు. సెటిల్‌మెంట్ల కోసం గానీ, మరెక్కడికైనా గానీ వెళ్లేటపుడు మహిళలు, యువతులను తీసుకెళ్లేవాడు నయీమ్.

నయీమ్ ఆగడాలు

నయీమ్ ఆగడాలు

అలాగైతే ఎవరో కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నట్లు పోలీసులు భావిస్తారని.. తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తారనేది నయీం వ్యూహంగా తెలుస్తోంది. అంతేగాకుండా, టార్గెట్ చేసిన వారిని ఆకర్షించడం కోసం, తన పని సులభంగా జరిగేందుకు యువతుల్ని ఎరగా వాడుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

English summary
It is said that Gangster Nayeemuddin has been used girls as his security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X