వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మాఫియాను తలదన్నేలా.. నయీమ్ ఆస్తుల చిట్టా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కోవర్టుగా మొదలై తనకంటూ ఓ ప్రత్యేక మాఫియా సామాజ్రాన్ని స్రుష్టించుకున్న నయీమ్.. వేల కోట్ల రూపాయాలను వెనకేసుకున్నట్లుగా తేలింది. ముంబై మాఫియాను సైతం తలదన్నే స్థాయిలో నయీమ్ తన ఆస్తులను కూడగట్టినట్లు పోలీసుల తాజా తనిఖీల్లో నిర్దారణ అయింది.

కాగా, ఈ ఆస్తుల చిట్టాను ఇప్పట్లో లెక్క తేల్చడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు పోలీసులు. తనిఖీల్లో బయటపడుతోన్న వేల కోట్ల రూపాయల డాక్యుమెంట్లను, ఆస్తులను చూసి పోలీసులే నివ్వెరపోతున్న పరిస్థితి. ప్రస్తుతం నయీమ్ బినామీలపై కూడా పోలీసులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

నయీమ్ ఆస్తుల చిట్టా :

కొండాపూర్ లో ఒకే దగ్గర 69 ఎకరాల భూమి నయీమ్ పేరు మీద ఉండగా.. దీని విలువ వెయ్యి కోట్లకు పైమాటే అంటున్నారు రెవెన్యూ అధికారులు.

పుప్పాలగూడ మణికొండ ప్రాంతాల్లో వేల కోట్ల విలువ చేసే దాదాపు 40 లగ్జరీ ఫ్లాట్లు

హైదరాబాద్ లో పదుల కొద్దీ ఫ్లాట్లతో పాటు, ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ సంఖ్యలో స్థలాలు

నల్గొండ జిల్లా భువనగిరి మండలంలోని బొమ్మలరామారంలో 500 ఎకరాలు

ఆడీ, హోండా సీఆర్వీ ఫోర్డ ఎండీవర్ లాంటి పలు ఖరీదైన కార్లు

స్వాధీనం చేసుకున్నవి :

ఇప్పటివరకు 4 పిస్టల్స్ తో పాటు ఓ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్
వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ ఫోన్లు
డైరీలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లతో పాటు మొమరీ కార్డులు, ల్యాప్ టాప్ లు స్వాధీనం

అంత్యక్రియలకు అడ్డు తగులుతోన్న బంధువులు :

గ్యాంగ్ స్టర్ నయీమ్ అంత్యక్రియల విషయంలో.. భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అంత్యక్రియల నిమిత్తం నయీమ్ మృతదేహాన్ని షాద్ నగర్ నుంచి భువనగిరికి తరలించగా.. అంత్యక్రియలకు బంధువులు అడ్డుపడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా సమాచారం .

Nayim relatives opposing his funeral

నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. అతని భార్య బిడ్డలను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడంతో.. అరెస్టు చేసిన వారిని తీసుకొస్తేనే అంత్యక్రియలు జరగనిస్తామని నయీమ్ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తోన్న బంధువులకు మద్దతుగా భారీ సంఖ్యలో ముస్లిం వర్గాలు కూడా నిరసన తెలపడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

పోలీసులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా.. నయీమ్ బంధువులు వినిపించుకోకపోగా.. నయీమ్ భార్యను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకొచ్చే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు భువనగిరి పోలీసులు.

నయీం అనుచరుడి అరెస్టు :

నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. అరెస్టు చేసిన నీలా గంగాధర్ గౌడ్ ను కోర్టులో ప్రవేశపెట్టాలని అతని భార్య మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వనస్థలిపురంలోని తమ ఇంటిపై దాడి చేసి తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొంది. ఇక మరో కేసులో నయీం ఇంట్లో పనిచేసే వంట మనిషిని నేడు కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ హత్యతో ఆమెకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి.

English summary
Nayim relatives are opposing his funeral, in bhuvanagiri the funeral arrangements was completed, but his relatives saying ' funeral will be possible after releasing his wife from custody only'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X