వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదిలేది లేదు, ఎస్సైని సస్పెండ్: గ్యాంగ్‌రేప్‌పై నాయిని సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన పైన ప్రభుత్వం సీరియస్‌గా ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం చెప్పారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఆయన చెప్పారు.

వీణవంక ఘటన పైన ఆయన సీరియస్ అయ్యారు. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కేసును వేగంగా దర్యాఫ్తు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కేసును స్వయంగా డిజిపి అనురాగ్ శర్మ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ... జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని కార్మికులకు హితవు పలికారు. విదేశాలకు వెళ్లాలని భావించే వారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఐదువేల మందిని విదేశాలకు పంపిస్తామన్నారు.

Nayini Narasimha Reddy serious on Veenavanka rape issue

చందంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌కు తూటా గాయం

నల్గొండ జిల్లా చందంపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ వెంకటయ్యకు తూటా గాయమైంది. మిస్‌ఫైర్‌తో వెంకటయ్యకు తూటా గాయమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్ వెంకటయ్య చందంపేట పీఎస్‌లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నారు. గాయపడిన వెంకటయ్యను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కానిస్టేబుల్ వెంకటయ్య 2013 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి.

English summary
Home Minister Nayini Narasimha Reddy serious on Veenavanka rape issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X