హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏపీలో జగన్‌దే గెలుపు, అందుకే కాంగ్రెస్‌లోకి రేవంత్, తన చెంచాలు ఉండాలనే చంద్రబాబు'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి సోమవారం జోస్యం చెప్పారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాదని అభిప్రాయపడ్డారు.

<strong>కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!</strong>కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!

ఓటర్ లిస్ట్‌లో లోపాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి కానీ కోర్టుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషనే సుప్రీం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇస్తోందని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.

చదవండి: 'ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు దేశం విడిచిపోయే ఛాన్స్', అంబులెన్స్‌పై జగన్ సెల్ఫ్‌గోల్!

శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసానిపై గెలవాలి

శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసానిపై గెలవాలి

కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని నాయిని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేశారు. ఓటర్ లిస్ట్ అవకతవకలు అంటూ కోర్టులో సవాల్ చేసిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గెలవాలన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్, తన చెంచా ఉండాలనే బాబు పొత్తు

అందుకే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్, తన చెంచా ఉండాలనే బాబు పొత్తు

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు అయిందని నాయిని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించామన్నారు. మూడు సీట్ల కోసం తెలంగాణ జన సమితి కోదండరాం తన పరువు తానే తీసుకుంటున్నారని చెప్పారు. హౌజింగ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. అమరవీరుల గురించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నాయిని అన్నారు. కేసీఆర్‌ను తిట్టేందుకే అతనిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. రేవంత్ భూకబ్జాదారుడని ఆరోపించారు. రేవంత్ ఓ బచ్చా అన్నారు. ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడన్నారు. తన చెంచాలు ఒకరిద్దరు తెలంగాణ అసెంబ్లీలో ఉండాలని, కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.

బీజేపీకి ఆ సీట్లు కూడా రావు

బీజేపీకి ఆ సీట్లు కూడా రావు

ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని నాయిని అన్నారు. టీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. ఐదు సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తామని కలలు కంటోందని, కానీ ఉన్న సీట్లు కూడా రావన్నారు.

మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మరి మీకు?

మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మరి మీకు?

కాంగ్రెస్ పార్టీ బట్టేబాజ్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైకమాండ్ దగ్గర చెంచాగిరి చేసి పదవి తెచ్చుకున్న ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అన్నారు. టీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. దేశంలో రైతుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పటాన్‌చెరు టిక్కెట్‌ను వేలం పాటకు పెట్టిందన్నారు.

English summary
TRS leader Nayini Narasimha Reddy takes on Telangana Congress working president Revanth Reddy, Chandrababu and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X