వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం కేసులో ఎవర్నీ వదలం: నాయని

By Pratap
|
Google Oneindia TeluguNews

నయూమ్ కేసులో రాజకీయనాయకులనుగాని, పోలీసులను వదిలేది లేదని అందరిని శిక్షిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖ సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రజల భాగస్వామ్యంతో రౌడిజం, గుండాయిజం, టెర్రరీజాన్ని అణచివేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు కార్పోరేట్‌స్దాయిలో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో పోలీస్‌స్టేషన్లకు వెళ్లాలంటే భయపడే బాధితులు ఇప్పుడు స్వేచ్చగా వెళ్లి తమ సమస్యలు విన్నవిస్తున్నారని తాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని తెలిపారు.

 Nayini Narsimha Reddy said that no body will be spered in Nayeem's case

కొత్త జిల్లాలు ఏర్పడిన క్రమంలో ఆయా జిల్లాల్లో కావాల్సిన వసతులు, స్టేషన్లు, సిబ్బంది నియామకాలు చేపడతామని వివరించారు. సీసీ కెమెరాల వల్ల అనేక కేసులను పోలీసులు సులంభంగా ఛేదిస్తున్నారని అందుకే అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు స్దానికంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. మహబూబ్ నగర్ లో పోలీస్ క్వార్టర్స్ కోసం 5 కోట్లు మంజూరు చేశామని త్వరలో వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో 75 లక్షలతో నూతనంగ నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి నాయిని మంగళవారం ప్రారంభించారు.

కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డ, డీజీపీ అనురాగ్‌శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు, స్దానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం భూత్పూర్ లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నాయిని నర్సింహ్మరెడ్డి ప్రారంభించారు.

English summary
Telangana home minister Nayini Narsimha Reddy said that no body will be spered in Nayeem's case and stern action will be taken on the culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X