హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యనగరంలో భవన నిర్మాణ కార్మికుల కొరత, ప్లైట్ టికెట్, జీతం పెంపు, కంపెనీల ఆఫర్లు..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ 5.0తో నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. అయితే ఇంతకుముందే భవన నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగే భవన నిర్మాణాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే ఎక్కువ. అయితే లాక్ డౌన్ వల్ల వారంతా పనిలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూలీల కొరత స్పష్టంగా కనిపిస్తోంది దీంతో భవన నిర్మాణ కంపెనీలు కూలీలకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

 కరోనా పేషంట్ మాయం: వైరస్ నిర్ధారించాక కనిపించని వృద్దుడు, 13 మంది హోం క్వారంటైన్... కరోనా పేషంట్ మాయం: వైరస్ నిర్ధారించాక కనిపించని వృద్దుడు, 13 మంది హోం క్వారంటైన్...

ప్లైట్ టికెట్, శాలరీ పెంపు

ప్లైట్ టికెట్, శాలరీ పెంపు

ఆఫర్ అంటే వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. వారు వచ్చేందుకు విమాన టికెట్, నెల నెల జీతం ఇదివరకంటే పెంచుతామని హామీనిస్తున్నారు. దీనిని భవన నిర్మాణ సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి. పాట్నా నుంచి 10 మంది కార్పెంటర్లను తీసుకొచ్చేందుకు తమ కాంట్రాక్టర్ ఒకరు ప్లైట్ టికెట్ బుక్ చేశారని హైదరాబాద్‌కు చెందిన ప్రెస్టిజ్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సురేశ్ కుమార్ తెలిపారు.

3 ప్రాజెక్టులు

3 ప్రాజెక్టులు


ప్రస్తుతం తమకు హైదరాబాద్‌లో మూడు ప్రాజెక్టులు ఉన్నాయని సురేశ్ తెలిపారు. తమ సైట్లలో 2300 మంది కూలీలు ఉండేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య 700కి చేరిందని చెప్పారు. మరి కొందరు కూలీలతో పనిచేసి.. కస్టమర్ నిర్దేశిత సమయంలో వారికి సైట్ అప్పగించడమే తమ లక్ష్యమని చెప్పారు.

3.5 లక్షల మంది

3.5 లక్షల మంది


లాక్ డౌన్ కన్నా ముందు రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది వలసకూలీలు పనిచేస్తున్నారని తెలిపారు. కానీ లాక్ డౌన్ సమయంలోనే వారంతా ఇంటికి వెళ్లిపోయారు. కొందరు వందలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ భవన నిర్మాణాలకు కేంద్రం ఇదివరకే అనుమతి ఇచ్చింది. దీంతో భవన నిర్మాణ సంస్థల పనుల వేగాన్ని పెంచాయి.

వేతనం పెంచాలని..

వేతనం పెంచాలని..


మరోవైపు పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న 1200 మంది కార్మికులు వెళ్లిపోయారు. దీంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మేఘా) కంపెనీ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరిన సంగతి తెలిసింది. అయితే మిగతా 1800 కార్మికులు.. కంపెనీ ఇచ్చే వేతనం పెంచాలని కోరుతున్నారు. రూ.10 వేలు వరకు ఇవ్వడం సరికాదని అంటున్నారు. వెళ్లినవారిలో వెయ్యి మంది తిరిగి పనిలో చేరగా.. మిగతా 800 మంది యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నారు.

English summary
several construction firms in Hyderabad have started wooing them back, offering flight tickets and also extra payments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X