వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్-2018 ఫలితాలు: అమేజింగ్.. కల్పనకు 99.99 శాతం, రెండో స్థానంలో తెలంగాణ రోహన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో ఢిల్లీకి చెందిన కల్పనా కుమారి టాపర్‌గా నిలిచింది. 99.99 పర్సెంటేజ్ సాధించింది. కల్పనా కుమారి బీహార్‌కు చెందిన విద్యార్థిని. ఢిల్లీలో పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది.

సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకారం ఆమె 99.99 శాతం పర్సంటేజ్ సాధించింది. కల్పనా కుమారి ఫిజిక్స్‌లో 180కి గాను 171, కెమిస్ట్రీలో 160, బయోలజీలో 360కి 360 మార్కులు సాధించింది. బోటనీ, జూవాలజీ.. రెండింటిలో 720 మార్కులకు గాను 691 మార్కులు సాధించింది.

 NEET result 2018: Delhi’s Kalpana Kumari is topper, gets 99.99 percentile, Telangana student in 2nd place

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహన్ పురోహిత్‌కు రెండో ర్యాంకు, ఢిల్లీకి చెందిన హిమాన్షు శర్మకు మూడో ర్యాంకు వచ్చింది. గత ఏడాదికి నీట్‌కు 11.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఈసారి 13 లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ సంస్థలలో 60,000 ఖాళీలు ఉంటాయి.

ఫలితాలను ఈ వెబ్ సైట్లో చూసుకోవచ్చు... cbseresults.nic.in

English summary
Kalpana Kumari scored the highest marks in this year’s NEET, the nationwide exam held to select students for undergraduate medical and dental courses. Rohan Purohit from Telangana and Himanshu Sharma from Delhi stood second and third in NEET 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X