కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపరిశుభ్ర పరిసరాల్లో వంట: విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదం

జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రభుత్వ పరంగా చేపడుతున్న వంట గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే ముగింపు దశకు చేరుకోవాల్సిన ఉండగా కొనసా..గుతూనే ఉన్నాయి.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్:జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రభుత్వ పరంగా చేపడుతున్న వంట గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే ముగింపు దశకు చేరుకోవాల్సిన ఉండగా కొనసా..గుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నిర్మాణాలపై అశ్రద్ధ, పర్యవేక్షణ లోపాలతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.

మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటను అపరిశుభ్ర వాతావరణంలో చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కింద వీటి నిర్మాణాలు చేపడుతుండటంతో స్థానికులు శ్రద్ధ చూపడం లేదు. నగరంలో నిర్మిస్తున్న వాటి పనులూ వూపందుకోవడం లేదు. అవసరం లేని పాఠశాలల్లో వాటిని మంజూరు చేయగా, అవసరమైన బడులకు అధికారులు మొండిచేయి చూపడం విశేషం. ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి.

పల్లెల్లో ఉపాధి హామీలో..

పల్లెల్లో ఉపాధి హామీలో..

నాలుగైదేళ్ల క్రితమే జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వంట గదులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులను అందించినా.. వాటి నిర్మాణ వైశాల్యం వంట గదికి సరిపోదన్న సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిలిచిపోయాయి. తాజాగా నిర్మాణ విస్తీర్ణత, నిధులను పెంచుతూ.. అవసరమైన బడులకు మంజూరు చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి కొత్తగా వంటగదుల నిర్మాణాలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్నారు. 45 శాతం ఉపాధి హామీ నిధులు, 55 శాతం విద్యాశాఖ నిధులతో నిర్మిస్తున్నారు. 200 మంది విద్యార్థులున్న బడిలో వంటగదికి రూ.2 లక్షలు, 200లకు పైగా విద్యార్థులున్న బడిలో వంట గదికి రూ.2.5 లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో మాత్రం టెండర్‌ ప్రక్రియ ద్వారా చేపడుతున్నారు.

 పూర్తయినవి 22 మాత్రమే..

పూర్తయినవి 22 మాత్రమే..

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 175 ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణాలు మంజూరు కాగా, 145 పాఠశాలల్లో నిర్మాణాలను ప్రారంభించారు. వాస్తవానికి గత విద్యాసంవత్సరం చివర్లోనే నిర్మాణాలను ప్రారంభించి, ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని నిర్మాణాలను ముగ్గుపోసి వదిలేయగా, మరికొన్ని స్థల సమస్యతో నిలిచిపోయాయి. కొన్ని చోట్ల స్థలం, నిధులున్నా గ్రామ ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసీ కమిటీల నిర్వాకంతో వంట గదుల నిర్మాణాలను నేటికీ ప్రారంభించలేదు.

ఇప్పటి వరకు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల లెక్కల ప్రకారం 22 వంట గదులను పూర్తి చేశారు. మరో 41 వంట గదుల నిర్మాణాలను నేటికీ ప్రారంభించలేదు. వంట గదులు 32 పైకప్పు స్థాయిలో, 5 పైకప్పు వేసే స్థాయిలో, 5 గోడల స్థాయి, 21 బేస్‌మెంట్‌, 12 పునాది స్థాయిలో మగ్గుతున్నాయి. ఉపాధి హామీ పనుల కింద వీటి నిర్మాణాలను గ్రామంలోని ప్రజాప్రతినిధులు లేదా ఎస్‌ఎంసీ కమిటీలు చేపట్టాల్సి ఉంది. ముందస్తుగా నిధులు రావంటే పలు గ్రామాల్లో ఇష్టారీతిగా పనులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పలు పాఠశాలల్లో స్థల సమస్య నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖలు చొరవ చూపడం లేదు. కొన్ని బడుల్లో వాటి నిర్మాణాలకు స్థలాలను ఎంపిక చేయడంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఆవరణలోని నిర్మాణాలకు అవి ప్రతిబంధకంగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. రెండు శాఖలు సమన్వయంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

కరీంనగర్‌లో సగమే...

కరీంనగర్‌లో సగమే...

కరీంనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన వంట గదుల్లో సగం నిర్మాణాలే కొనసాగుతున్నాయి. మొత్తం 12 పాఠశాలలకు గదులు మంజూరు కాగా, వాటి నిర్మాణాలకు టెండర్‌లను జిల్లా సర్వశిక్ష అభియాన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఆహ్వానించారు. అయిదింటికే టెండర్‌లు దాఖలవగా, సవరన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణానికి టెండర్‌ కూడా దాఖలవలేదు. వాటిల్లో రెండు పైకప్పు, రెండు బేస్‌మెంట్‌ స్థాయిలో నిర్మాణాలుండగా, ఒకదాని నిర్మాణం పునాది స్థాయిలో ఉంది. మంజూరైన 12 వంట గదుల్లో అవసరం లేని ఆరు పాఠశాలలకు మంజూరయ్యాయంటే అధికారుల ప్రతిపాదనల్లోని లోపాలను ఎత్తిచూపుతోంది. అవసరం ఉన్న బడులకు వాటి నిర్మాణాలు లేకపోగా, అనవసరమైన వాటికి మంజూరు చేశారు. దీంతో సదరు ఆరు నిర్మాణాలను అవసరమైన మరో 6 పాఠశాలలకు మంజూరు కోసం సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు.

నిర్మాణాలు పూర్తయిన వాటికి నిధులు: ఎ వెంకటేశ్వర్‌రావు, డీఆర్డీవో

నిర్మాణాలు పూర్తయిన వాటికి నిధులు: ఎ వెంకటేశ్వర్‌రావు, డీఆర్డీవో

వంట గదుల నిర్మాణాలను పూర్తిచేసిన వారికి త్వరలో నిధులు అందిస్తాం. అక్కడక్కడా నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని నిర్మాణాలు ప్రారంభించ లేదు. ఈ విషయంలో స్థానిక సర్పంచులు, ఎస్‌ఎంసీ కమిటీలు చొరవ తీసుకుని వాటి నిర్మాణాలను ఒక సామాజిక కార్యక్రమంగా తీసుకుని వంట గదుల నిర్మాణాలను పూర్తి చేయాలి. గ్రామంలోని విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తున్నామన్న భావనతో నిర్మాణాలకు ముందుకురావాలి.

English summary
Neetles cooking in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X