వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్య శ్రీ ఆసుపత్రులతో చర్చలు సఫలం.. ప్రారంభం అయిన వైద్య సేవలు

|
Google Oneindia TeluguNews

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత అయిదు రోజులుగా నిలిపివేసిన ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సెక్రటేరియట్‌లో మంగళవారం సాయంత్రం ఆసుపత్రుల ప్రతినిధులతో వైద్యశాఖ మంత్రి ఈటేల రాజెందర్ చర్చలు జరిపారు. దీంతో హస్పిటల్ యాజామాన్యాల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆసుపత్రులకు ఉన్న బకాయిలు త్వరలో చెల్లిస్తామని ఈటేల వారికి హమి ఇచ్చారు. ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ఇక నుండి ప్రతినెలా చెల్లిస్తామని మంత్రి హామి ఇచ్చారు. దీంతో సమ్మేను విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కాగా ఇంకా ఆసుపత్రులకు రూ.490 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు.

Negotiations with Arogya Sri network hospitals have been successful

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు చాలా బాగా అమలవుతున్నాయని మంత్రి ఈటేల రాజెందర్ ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోటి 85లక్షల కుటుంభాలకు ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇది కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కన్నా 100 రెట్లు అదనంగా సేవలు అందుతున్నాయని అన్నారు.కాగా అయూష్మాన్ భారత్ పథకంలో కేవలం 25 లక్షల కుటుంభాలకు వర్తిస్తోందని తెలిపారు. ఆసుపత్రులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోనే రూ 520 కోట్లు చెల్లింపులు చేశామని చెప్పారు. గతంలో జరిగిన ఎంఓయూలను పున:సమీక్షించేందుకు కమిటీని వేస్తామని చెప్పారు. ఇక వరుస ఎన్నికలు వచ్చిన నేపథ్యంలోనే ఆసుపత్రుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఈటేల చెప్పారు. ఇక మంత్రి చర్చలతో సంతృప్తి వ్యక్తం చేసిన ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలను తిరిగి పునరిద్దంచనున్నట్టు ప్రకటించారు.

English summary
Telangana Government's negotiations with Arogya Sri network hospitals have been successful.Health Minister Etela Rajender held discussions with representatives of hospitals. in Telangana Secretariat on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X