వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవితాలు నాశనం చేశాడు: కేటీఆర్ సభలో గందరగోళం, నేరెళ్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం (వీడియో)

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల సభలో ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో పాల్గొన్నారు.

<strong>కాళ్లు మొక్కి కేసీఆర్ చెప్పిన మాటలు విని సోనియా ఆశ్చర్యపోయారు: విజయశాంతి షాకింగ్</strong>కాళ్లు మొక్కి కేసీఆర్ చెప్పిన మాటలు విని సోనియా ఆశ్చర్యపోయారు: విజయశాంతి షాకింగ్

సభ జరుగుతున్న సమయంలో నేరెళ్ల బాధితుడు ఒకరు ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటనలో తమకు న్యాయం చేయకపోగా, పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు ఈ పనికి పాల్పడ్డాడు.

తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. అదుపులోకి తీసుకుని తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Nerella victim suicide attempt in KTR meeting

ఈ సందర్భంగా బాధితుడు.. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. మా జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడని చెప్పారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు.

నేను ఏం తప్పు చేశానని తనను కేటీఆర్ పోలీసులతో కొట్టించాడని ప్రశ్నించాడు. తనను చంపించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఏ కారణం లేకుండా తమను పోలీసులతో కొట్టించిండన్నారు. నేరెళ్ల బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు.

English summary
Nerella victim suicide attempt in Telangana Minister KT Rama Rao meeting. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X