హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త కోణం: గ్యాంగ్ వార్ కాదు!, ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి వెనుక ఇదీ జరిగింది..

వాట్సాప్ గ్రూపులో జరిగిన వాగ్వాదమే భువనేశ్వర్ పై దాడికి కారణమైంది. శుక్రవారం రోజు రోహిత్ ను కొట్టబోతున్నానంటూ మొదట భువనేశ్వర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరూ తీవ్ర

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు శివారు మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఘర్షణకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ గ్రూపు చాటింగ్సే వీరి మధ్య 'ఈగో' సమస్యను తీసుకొచ్చాయని, దానివల్లే దాడి జరిగి ఉంటుందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

ఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్‌వార్‌: బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి కత్తిపోట్లుఇంజనీరింగ్ కాలేజీలో గ్యాంగ్‌వార్‌: బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి కత్తిపోట్లు

రోహిత్(20) దాడిలో గాయపడ్డ భువనేశ్వర్(20) పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారని, ఇద్దరూ ఒకే క్లాస్ అని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. కాలేజీలో చేరి మూడు నెలలు కూడా కాకముందే కత్తులతో దాడి చేసుకునేదాకా వీరి గొడవలు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ చాటింగ్‌లో ఏముంది?:

వాట్సాప్ చాటింగ్‌లో ఏముంది?:

రోహిత్, భువనేశ్వర్ ల మధ్య వివాదానికి ప్రధాన కారణం వాట్పాప్ లో వారు ఏర్పాటు చేసుకున్న గ్రూపే అని తెలుస్తోంది. గ్రూపు ఛాటింగ్ 'హాయ్.. బై.. వంటి విషయాలకే పరిమితమవాలి తప్ప.. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడమెందుకు?' అన్న చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్-భువనేశ్వర్ ల మధ్య వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.

చెప్పి మరీ దాడి:

చెప్పి మరీ దాడి:

వాట్సాప్ గ్రూపులో జరిగిన వాగ్వాదమే భువనేశ్వర్ పై దాడికి కారణమైంది. శుక్రవారం రోజు రోహిత్ ను కొట్టబోతున్నానంటూ మొదట భువనేశ్వర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. శుక్రవారం ఉదయం రోహిత్ తన స్నేహితులను వెంటబెట్టుకుని కాలేజీకి వెళ్లాడు. అప్పుడే బస్సులో కాలేజీకి వచ్చిన భువనేశ్వర్ పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. స్నేహితులు భువనేశ్వర్ చేతులు పట్టుకోగా రోహిత్ దాడికి దిగాడు. దీంతో భువనేశ్వర్ ముఖం, చేతులు, నడుముకు గాయాలయ్యాయి.

అడ్డుపడ్డ స్నేహితుడు:

అడ్డుపడ్డ స్నేహితుడు:

రోహిత్ అతని స్నేహితులు భువనేశ్వర్ పై దాడి చేస్తున్న క్రమంలో వైభవ్ అనే మరో మిత్రుడు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను కూడా గాయాలపాలయ్యాడు. గాయపడ్డ భువనేశ్వర్, రోహిత్ లను ఆసుపత్రికి తరలించారు.హైదరాబాదు శివారు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడ్డ రోహిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం.

పాత శత్రుత్వం ఉందా?:

పాత శత్రుత్వం ఉందా?:

రోహిత్-భువనేశ్వర్ ల మధ్య పాత శత్రుత్వమేమైనా ఉందా? అంటే.. వీరిద్దరు నర్సింహారెడ్డి కాలేజీలో చేరిన తర్వాతే ఒకరికొకరు పరిచయమైనట్టు తెలుస్తోంది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే వీరిద్దరి మధ్య ఇంత ఘర్షణకు దారితీసే కారణాలేముంటాయన్నది అంతుపట్టడం లేదు. కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థుల అవగాహనరాహిత్యమే వారిని ఇలాంటి దాడులకు పాల్పడేలా చేసిందంటున్నారు. కేవలం ఈగో సమస్యల వల్లే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని చెబుతున్నారు.

గ్యాంగ్ వార్ కాదు:

గ్యాంగ్ వార్ కాదు:

విద్యార్థుల ఘటనను మీడియా చానెళ్లు గ్యాంగ్ వార్‌గా చిత్రీకరించడం సరికాదని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఇది గ్యాంగ్ వార్ కానే కాదని, ఇద్దరు విద్యార్థులు అవగాహన రాహిత్యంతో ఘర్షణకు దిగారని చెబుతున్నారు. తమ కాలేజీలో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, ఏ చిన్న ఫిర్యాదు అందినా వెంటనే స్పందిస్తామని నర్సింహారెడ్డి కాలేజీ యాజమాన్యం చెబుతోంది. కాలేజీ ముందు ప్రాంతంలో సీసీటీవి కెమెరాలు లేనందున ఘర్షణ తాలుకు దృశ్యాలు ఎక్కడా రికార్డు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Whats app group chatting leads to attack on Engineering college student Bhuvaneswar in Medchal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X