వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీటర్ రీడింగ్ పడింది.!బుర్ర తిరిగింది.!వేలల్లో బిల్లులు ఎలా కట్టాలి.?నగర వాసుల్లో కొత్త కలవరం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రజల ఆర్ధిక అవసరాలు, జీవనోపాది మీద లాక్‌డౌన్ ఆంక్షల ప్రభావం వల్ల మూడు నెలల పాటు కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు రాష్ఠ్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అందులో ముఖ్యంగా నగర వాసులు కరెంటు బిల్లులు మూడు నెలల వరకూ చెల్ించాల్సిన అవసరం లేదని చెప్పడంతో పాటు ఇంటి అద్దెలను బలవంతంగా వసూలు చేయొద్దని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు. కాగా ఇంటి అద్దెలను కట్టగలిగే వాళ్ల నుండి ఇంటి యజమానులు దాదాపు వసూలు చేయగలిగినా కరెంటు విషయంలో మాత్రం సంయమనం పటించారు. తాజాగా గత బకాయిలతో కలిపి బిల్లులు రావడంతో నగర వాసులకు మైండ్ బ్లాంక్ ఐనంత పనైనట్టు తెలుస్తోంది.

నగరంలో కరెంట్ బిల్లులు షురూ.. బకాయిలు చూసి పరేషాన్ అవుతున్న నగర వాసులు..

నగరంలో కరెంట్ బిల్లులు షురూ.. బకాయిలు చూసి పరేషాన్ అవుతున్న నగర వాసులు..

మాంచి ఎండా కాలం కూడా చెమటలు పట్టిన సందర్బాలు లేవు గానీ తాజాగా వచ్చిన కరెంటు బిల్లులను చూసిన ప్రతిఒక్క నగర వాసికి ముచ్చెమటలు పట్టుకొస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లులను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావే ఆదేశాలు జారీ చేసే సరికి విద్యుత్ వినియోగదారులు ఎంతో ఉపశమనంగా భావించారు. మాంచి ఎండాకాలం మూడు నెలలు ఎంతో చల్లగా, హాయిగా గడిపేసారు. కానీ బుదవారం అకస్మాత్తుగా వచ్చిన మీటర్ రీడింగ్ బిల్లులకు సంబంధించన శబ్దం వినియోగ దారుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించాయి. అందుకు తగ్గట్టుగానే కరెంట్ బిల్లులో వచ్చిన ఎమౌంట్ చూసి నగర వాసులకు ఒక్కసారిగా కళ్లు బైర్లుకమ్మినట్టైంది.

దిమ్మతిరిగిన కరెంటు బిల్లులు.. మూడు నెలల బకాయిలు ఒక్కసారిగా రావడంతో షాక్..

దిమ్మతిరిగిన కరెంటు బిల్లులు.. మూడు నెలల బకాయిలు ఒక్కసారిగా రావడంతో షాక్..

లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన కరెంట్ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ బుదవారం నుంచి మొదలయ్యాయి. కరోనా వ్యాపించకుండా ఉండడంతో పాటు, నగర వాసుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల నుంచి మీటర్ రీడింగ్ లకు బ్రేకులిచ్చారు. విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల మేరకు గత ఏడాది ఏప్రిల్, మే నెలల బిల్లుల ప్రకారం, ఈ ఏడాది ఈ రెండు నెలలకు అంచనా బిల్లులు చెల్లించే అవకాశం కల్పించారు. లాక్‌డౌన్ సడలింపుల కారణంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీస్తూ సంబందిత ఇళ్ల వారికి అందజేస్తున్నారు. బిల్లులోని ఎమౌంట్ చూసిన ప్రతి ఒక్కరూ బెంబేలెత్తి పోతున్నట్టు తెలుస్తోంది.

ఎండా కాలం కూడా చెమటలు పట్టలేదు.. కరెంటు బిల్లులు చూసి చెమటతో తడిసి పోతున్న నగర వాసులు..

ఎండా కాలం కూడా చెమటలు పట్టలేదు.. కరెంటు బిల్లులు చూసి చెమటతో తడిసి పోతున్న నగర వాసులు..

ఇదిలా ఉండగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి వాస్తవ బిల్లులను రీడింగ్ నమోదు చేస్తున్నారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన అంచనా బిల్లులు చెల్లించిన వారి వివరాలు, చెల్లించనివారి వివరాలన్నీ బిల్లింగ్ మీషన్ డేటా ఆధారంగా లెక్క కడుతున్నారు. మూడు నెలల పాటు వాడిన కరెంటు మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్క నెలకు ఎంత చెల్లించాలో రమారమి లెక్కించి అసలు బిల్లు ఇచ్చేటట్లు సాఫ్ట్ వేర్ ను రూపొందించారు విధ్యుత్ శాఖ అధికారులు. ఒకవేళ మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి జారీ చేసిన అంచనా బిల్లులు ప్రస్తుతం ఇచ్చే వాస్తవ బిల్లు కంటే అధికంగా ఉంటే మైనస్ బిల్లు ఇవ్వనున్నారు. కానీ ఈ లోపే బిల్లును చూసిన వినియోగదారులు షాక్ కు గురౌతున్నారు.

బిల్లుల చెల్లించలేం.. సీఎం ప్రత్యామ్నాయం చూపించాలంటున్న నగర వాసులు..

బిల్లుల చెల్లించలేం.. సీఎం ప్రత్యామ్నాయం చూపించాలంటున్న నగర వాసులు..

మరోవైపు మూడు నెలలుగా ఎలాంటి విద్యుత్ బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో కాస్త ఊరట చేందారు నగర వాసులు. కరోనా క్లిష్ట సమయంలో ఓపక్క జీవనోపాది లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఈ కరెంటు బిల్లుల మోతేంటి దేవుడా అనుకుంటున్నారు వినియోగదారులు. అసలు మూడు నెలలు కరెంటు బిల్లులు చెల్లించొద్దని ఆదేశాలు ఇవ్వకున్నా ఏదో రూపంలో, అప్పో సొప్పో చేసి నెలవారీ బిల్లును చెల్లించే వాళ్లమని, ఇప్పుడు బకాయిలు మొత్తం కలిపి ఇంత మొత్తం చెల్లించడం తలకు మించిన భారంగా పరిణమించిందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సారిగా పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లుల చెల్లింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోకపోతే ఆర్ధిక ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Unless CM Chandrasekhar Rao makes an alternative decision on the payment of large electricity bills City dwellers have expressed concern that the economic woes are doubling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X