• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం.!పిసీసీతో సహా మరికొన్ని కీలక మార్పులు.!వారంలో అంతా సెట్ అయ్యే అవకాశం.!

|

హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ నూతన జవసత్తువలు నింపుకొని, రెట్టింపు ఉత్సాహంతో పట్టాలెక్కి పరుగులు పెట్టేందుకు సంసిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకోసం కాకుండా పార్టీ శ్రేణుల్లో భరోసా నింపి, బలోపేతమే లక్ష్యంగా నవనిర్మాణం దిశగా అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. రాజకీయంగా ఎలాంటి హడావిడి గాని, ఎలాంటి ఎన్నికలు గాని సమీప భవిష్యత్తులో లేవు కాబట్టి కొత్త నాయకత్వంలో పార్టీ సంస్థాగత పటిష్టతకోసం కృషి చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పీసిసి నాయకుడితో పాటు మరికొన్ని కీలక మార్పులు చేసి పార్టీలో దూకుడు పెంచేందుకు అదిష్టానం పకడ్బందీ కసరత్తు చేసిన్నట్టు తెలుస్తోంది.

 కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ.. మరో వారం రోజుల్లో కొత్త అద్యక్షుడి ప్రకటన..

కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ.. మరో వారం రోజుల్లో కొత్త అద్యక్షుడి ప్రకటన..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో జరగాల్సిన పిసీసీ అద్యక్షుడి మార్పు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ఫైనల్ చేయాలని అదిష్టానం నిర్ణయించింది. దీంతో అన్నీ సర్ధుకున్నాయి కాబట్టి పార్టీ ప్రక్షాలణలో భాగంగా అన్ని మార్పులను చేసేందుకు కాంగ్రెస్ అదిష్టానం సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ముందస్తు సమావేశాలు నిర్వహిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా తెలంగాణా కాంగ్రెస్ విదేయుల ఫోరమ్ నాయకులు మంగళవారం జూమ్ యాప్ ద్వారా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను, పార్టీ పరిస్థితిని సమీక్షించారు.

 ప్రస్తుతం రాజకీయ హడావిడి లేదు.. పార్టీ బలోపేతమే లక్ష్యం అంటున్న కాంగ్రెస్ నేతలు..

ప్రస్తుతం రాజకీయ హడావిడి లేదు.. పార్టీ బలోపేతమే లక్ష్యం అంటున్న కాంగ్రెస్ నేతలు..

అంతే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం వచ్చినప్పటికి, ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలలో పార్టీ వరుస అపజయాలు గురించి లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్, మినీ మున్సిపల్ పోల్ లో కూడా ఓటమి పాలవడముతో పార్టీ అధిస్టానికి అన్ని విషయాలను వివరిస్తూ మరో సారి ఓ లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను తెలుసుకొని అందుకు తగ్గట్టు మార్పులు చేయాలన్నది అదిష్టానం వ్యూహంగా తెలుస్తోంది.

 అధికార పార్టీలో సంక్షోభం.. అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు..

అధికార పార్టీలో సంక్షోభం.. అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు..

ప్రస్తుత పరిస్థితుల్లో అధికార గులాబీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని సునిశితంగా పరిశీలించి వాస్తవ పరిస్తితులను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒకరి మీదనో, ఇద్దరి మీదనో చర్యలు తీసుకుంటే సరిపోదని, గతంలో అవినీతి, భూఆక్రమణల ఆరోపణలు వచ్చిన వారందరి మీద పారదర్శక విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అందుకోసం గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ నేతల చిట్టాను సిద్దం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రులపైన కొన్ని భూకబ్జా ఆధారాలను బహిర్గతం చేసి సంచలనంగా మారారు.

 రేవంత్ రెడ్డికే పిసీసీ.. వారం రోజుల్లో ప్రకటన చేయనున్న అధిష్టానం..

రేవంత్ రెడ్డికే పిసీసీ.. వారం రోజుల్లో ప్రకటన చేయనున్న అధిష్టానం..

అంతే కాకుండా ప్రధానంగా పిసీసీ అధ్యక్షుడి మార్పును చేసి దాని ద్వారా పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. దాదాపు పిసీసీ కొత్త అద్యక్షుడిని ప్రకటించే సమయానికి సాగర్ ఎన్నిక నోటిఫికేషన్
రావడంతో కొత్త పిసీసీ ప్రకటన నిలుపుదల చేసింది అదిష్టానం. ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుకున్నాయి కాబట్టి మరో వారం రోజుల లోపు అన్ని రకాల మార్పులు చేసుకుంటాయని, కొత్త అద్యక్షుడితో పాటు కొత్త కార్యనిర్వాహక సభ్యులు కూడా టీపిసీసీలో చోటు సంపాదించబోతునట్టు తెలుస్తోంది. దీంతీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో ముందడుగు వేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

English summary
It seems that the Telangana Congress is getting ready to run with double enthusiasm. Information that steps are being taken towards innovation aimed at strengthening and strengthening the party ranks rather than for elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X