వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో తెలంగాణకు కొత్త గవర్నర్..! కసరత్తు చేస్తున్న కేంద్ర సర్కార్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శత్రువును దెబ్బకొట్టాలంటే కింది స్థాయినుంచైనా ప్రణాళిక రచించాలి, లేదా పై స్ధాయినుంచైనా వ్యూహం రచించాలి. ప్రస్తుతానికి బీజేపీయేతర రాష్ట్రల్లో కమలం పార్టీ చేంతస్తుంది ఇదే...! ప్రభుత్వ వ్యస్థలను చేతులోకి తీసుకావాలంటే రాజ్యంగ బద్ద పదవుల్లో ఉన్న ఉన్నత వ్యక్తులను మార్చి ఫలితం రాబట్టాలనేది కేంద్ర బీజేపి ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. అందులో బాగంగా మొన్న ఆంద్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ ను నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో బాగంగా రానున్న మూడు రోజుల్లో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం అయ్యే సూచనలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టాక ప్రత్యేకంగా గవర్నర్ ల నియామకాలపై దృష్టి పెట్టారు. కరుడుగట్టిన సంఘ్ నేతలను ఏరి కోరి నియమిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రత్యేక దృష్టి తో గవర్నర్ లను నియమిస్తున్నారు. ఐదేళ్లు గా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగిన నరసింహన్ ను ఏపీ నుండి తప్పించి తెలంగాణ కు పరిమితం చేశారు.బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణా లో రాజకీయంగా బలపడాలని భావిస్తోంది.

New Governor for Telangana.!central govt doing the exercise..!!

అందుకే బీజేపీ నేపథ్యం ఉన్న నేతను తెలంగాణా గవర్నర్ గా నియమించే యోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఈ మద్య రాజ్ భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో గంట సేపు భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం ఖాయమన్న కచ్చితమైన సమాచారం రావడంతోనే, సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా గవర్నర్‌తో సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ మారుతున్నారన్న సమాచారం తోనే సీఎం చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో నరసింహన్ తో చాలా సేపు భేటి అయ్యారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

ఇక నరసింహన్ ను తెలంగాణ నుండి కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. నరసింహన్ 12 ఏళ్లుగా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో 4ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, విభజన తర్వాత ఐదేళ్లు రెండు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు. ఇంత సుదీర్ఘ కాలం ఒకే చోట ఉండటం రికార్డ్ గా చర్చ జరుగుతోంది.

English summary
Telangana CM Chandrasekhar Rao went to Raj Bhavan.He met with the Governor for an hour. With the news of the appointment of the new governor of Telangana in two and three days, CM Chandrasekhar Rao is campaigning specifically to meet with the governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X