హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త చట్టం: కేటీఆర్, మహబూబ్‌నగర్‌లో కేసీఆర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో సమూల మార్పుల కోసం కొత్తచట్టం తీసుకువస్తామని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇందుకోసం కేరళ, కర్ణాటక పంచాయితీ వ్యవస్థలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

ప్రజల డబ్బు ప్రజల కోసమేనన్న భరోసా కల్పిస్తామన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళా సంఘాలకు కూడా ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనల తీసుకుని వాటి ఆధారంగా కొత్తచట్టాలు రూపొందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయితీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

మహబూబ్‌నగర్ చేరుకున్న కేసీఆర్

New laws for panchayat transition says Minister KT Ramarao

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా మహబూబ్‌నగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

అనంతరం పాతపాలమూరులో టీడీగట్టు, ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ఎర్రమన్నుగుట్ట, పాతతోట మురికివాడలు పర్యటించనున్నారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

English summary
Minister KT Ramarao says new laws for panchayat transition in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X