వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త, పాత క‌ల‌యిక‌తో మంత్రి వ‌ర్గం..! మ‌ళ్లీ పాత‌వాళ్ల‌కే అంటే ఎలా..? క్యాబినెట్ పై కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి స్పందించారు. తెలంగాణ ప్ర‌భుత్వం రెండో సారి అదికారంలోకి వ‌చ్చి ప‌క్షం రోజులు గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు ఎమ్మెల్యేల‌ ప్ర‌మాణ స్వీకారం గాని, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ గాని జ‌ర‌గ‌లేదు. కేసీఆర్ దేశ ప‌ర్య‌ట‌న త‌ర్వాత మంత్రి మండ‌లి ఏర్ప‌డుతుంద‌నుకుంటే దానికి కూడా ముహూర్తం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. కాక‌పోతే మంత్రివ‌ర్గం కూర్పు ఎలా ఉంటుందో స్ప‌ష్ట‌త ఇచ్చారు కేసీఆర్. గ‌త క్యాబినెట్ లో మంత్రులుగా చేసిన వారికి ఈ సారి పెద్దగా అవ‌కాశాలు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తేల్చి చెప్పారు చంద్ర‌శేఖ‌ర్ రావు. కొత్త‌వారికి కూడా అవకాశాలు ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. ఐతే విస్త‌ర‌ణ ఎప్పుడు ఉంటుందో మాత్రం కేసీఆర్ చెప్ప‌లేదు.

పాత వాళ్లలో ఉత్కంఠ‌..కొత్త‌వారిలో చిగురించిన ఆశ‌లు..! ఆస‌క్తిగా కేసీఆర్ వ్యాఖ్య‌లు..!!

పాత వాళ్లలో ఉత్కంఠ‌..కొత్త‌వారిలో చిగురించిన ఆశ‌లు..! ఆస‌క్తిగా కేసీఆర్ వ్యాఖ్య‌లు..!!

రాష్ట్ర కొత్త మంత్రివర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన జట్టులో ఎవరిని చేర్చుకుంటారనే ఆసక్తి పెరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఒకింత ఆలస్యమవుతుండటంతో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. కొత్త ఎమ్మెల్యేలలో అత్యధికులు రెండు, అంత కంటే ఎక్కువసార్లు గెలిచిన వారే ఉన్నారు. దీంతో మంత్రి పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులను ఆశించే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలుస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి నేరుగా తమ మనసులోని కోరికను చెబుతున్నారు. సీఎంకు చెప్పి మంత్రివర్గంలో చోటు కల్పించేలా చేయాలని కోరుతున్నారు.

క్యాబినెట్ విస్థ‌ర‌ణ ఎప్పుడో తెలియ‌దు..! ఎవ‌రెవ‌రు ఉంటారో చెప్పిన సీయం..!!

క్యాబినెట్ విస్థ‌ర‌ణ ఎప్పుడో తెలియ‌దు..! ఎవ‌రెవ‌రు ఉంటారో చెప్పిన సీయం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కె.చంద్రశేఖర్‌రావు తన కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్‌లోకి మంత్రులను తీసుకునేందుకు కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ఆశావహులకు మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలాలేవు. రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో ముఖ్యమంత్రిసహా మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. అంటే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 17 మందికి మంత్రులయ్యే అవకాశం ఉంది. ఆ అదృష్ణం ఎవరిని వరిస్తుందనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కేబినెట్‌ కూర్పు ఉంటుంద‌నే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చాలా మంది కొత్త‌వారు..! మంత్రి ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుందో..!!

చాలా మంది కొత్త‌వారు..! మంత్రి ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుందో..!!

ఆయన గతంలో వివిధ సందర్భాల్లో మంత్రి పదవులపై పలువురికి హామీలు ఇచ్చారు. వాటిని ఈసారి నిలబెట్టుకుంటారా? అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తుంది . జిల్లాల వారీగా చూస్తే ఎమ్మెల్యేల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, జి.జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, పట్నం నరేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్లారెడ్డి, బాల్క సుమన్‌, సీహెచ్‌ లక్ష్మారెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస‌గౌడ్‌, మర్రి జనార్దన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, దానం నాగేందర్‌, పద్మారావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌, అరికెపూడి గాంధీ, మాధ‌వ‌రం క్రిష్ణారావు తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి.

ఆ ముగ్గురు సీనియ‌ర్ల పైనే అంద‌రి ద్రుష్టి..! మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుందా..?

ముగ్గురు నేతలు! రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు. కానీ క్యాబినెట్‌లో మాత్రం స్థానం పొందలేకపోయారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వారికి మంత్రి పదవి చేజారుతోంది. మరి ఈ దఫా అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి అమాత్యయోగం పడుతుందా? ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరు?
ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి. 20 ఏళ్లకుపైగానే వారు రాజకీయాల్లో ఉన్నారు.
ఎర్రబెల్లి 1994 నుండి ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈసారి అదే సామాజికవర్గానికి చెందిన జాపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో ఈసారి ఎర్రబెల్లికి క్యాబినెట్‌లో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న మరో సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి. క్యాబినెట్ విస్తరణలో గుత్తాకు ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు.

English summary
The Chief Minister of Telangana has responded to the expansion of the cabinet. The Telangana government has been forced to come in for the second time and has been in power for 15 days and so far has not been sworn in by the MLAs or the expansion of the ministerial category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X