వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ చేయాలని కెసిఆర్ కోరారు,అండర్ డాగ్‌ను కాదు, రాజకీయ పార్టీ: కోదండరామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకానుంది. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదాండరామ్ ప్రకటించారు.మరోవైపు తనను ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని కెసిఆర్ గతంలో కోరారని కోదండరామ్ చెప్పారు. కానీ, పౌరస్పందన వేదికగా పనిచేయాలని నిర్ణయించుకొన్నట్టు కోదండరామ్ గుర్తు చేసుకొన్నారు.

డీలిమిటేషన్‌ సాధ్యం కాదు, మహకూటమికి సన్నాహలు: జానారెడ్డిడీలిమిటేషన్‌ సాధ్యం కాదు, మహకూటమికి సన్నాహలు: జానారెడ్డి

కొంతకాలంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ జెఎసి కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఆచరణ రూపంలోకి వస్తోంది.ఆదివారం నాడు తెలంగాణ జెఎసి విస్తృతస్థాయి సమావేశం హైద్రాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హల్ లో జరిగింది.

టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఏర్పాటు అవసరమని ప్రజలు కోరుకొంటున్నారని రాజకీయ జెఎసి చైర్మెన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ

రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ

రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చినట్టు టిజెఎసి చైర్మెన్ కోదండరామ్ ప్రకటించారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.రైతుల కోసం పెద్ద పోరాటమే చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలని ప్రజలంతా కోరుతున్నారని, అది లేకపోతే తమ పోరాటానికి ఫలితం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. డబ్బున్నవారే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ప్రజల సహకారంతోనే పార్టీ నడపాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీతో పాటు ఐకాస కూడా నడుస్తుందని కోదండరాం స్పష్టంచేశారు.

మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది

మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది

మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిందని టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నారు. ఆ సమయంలో మిలియన్ మార్చ్ చేయకూడదని కెసిఆర్ ఉద్దేశ్యంగా ఉందని కోదండరామ్ చెప్పారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నందన మిలియన్ మార్చ్ వద్దని కెసిఆర్ భావించారని కోదండరామ్ చెప్పారు, కానీ, మిలియన్ మార్చ్ ను వాయిదా వేస్తే ఉద్యమానికి ఇబ్బందులు ఎదురౌతాయని భావించి మిలియన్ మార్చ్ ను నిర్వహించినట్టు కోదండరామ్ చెప్పారు.

ఎంపీ, ఎమ్మెల్యే స్థానానానికి పోటీ చేయాలని కెసిఆర్ కోరారు

ఎంపీ, ఎమ్మెల్యే స్థానానానికి పోటీ చేయాలని కెసిఆర్ కోరారు


ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని తనకు కెసిఆర్ ఆనాడు కోరారని టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ చెప్పారు. కానీ, తనకు ఆ పదవుల్లో పోటీ చేయడం ఇష్టం లేదని ఆనాడే తాను చెప్పానని ఆ ఇంటర్వ్యూలో కోదండరామ్ చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలిపేందుకు పౌరస్పందన వేదికగా పనిచేయాలని నిర్ణయించుకొన్నట్టు కెసిఆర్ కు చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

అండర్ డాగ్ ను కాదు, సూపర్ మ్యాన్ కాదు

అండర్ డాగ్ ను కాదు, సూపర్ మ్యాన్ కాదు

తాను అండర్ డాగ్ ను కాదని, అదే సమయంలో సూపర్ మ్యాన్ ను కూడ కాదని టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నట్టు చెప్పారు. నా స్థాయిని తెలుసుకొనే మాట్లాడుతున్నట్టు ఆ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోదండరామ్ స్పష్టం చేశారు.ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నామని కోదండరామ్ చెప్పారు.

English summary
TJAC chairman Kodandaram announced that JAC establish a new party in Telangana.TJAC meeting held at Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X