వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకలి తీర్చే.. 'అన్నం పరబ్రహ్మం-సహకార ఆహారం'

ఆపన్నుల ఆకలి తీర్చేందుకు 'అన్నం పరబ్రహ్మం, సహకార ఆహారం' పేరిట సరికొత్త కార్యక్రమాన్ని నవంబర్ 26న మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఆకలితో అలమటించే వారికి భోజనం అందించి ఆదుకునేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్‌ అమ్రపాలి కాట, నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ తెలిపారు. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం-వృథా చేయరాదు' మిగిలిన అన్నం ఇతరుల ఆకలితీర్చేందుకు అందించాలని వారు కోరారు. ఇందుకు నగరంలో ఉన్న పెద్ద, చిన్న హోటళ్లతోపాటు అందరూ సహకరించాలన్నారు.

సోమవారం వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ టూరిజం, హోటల్‌ యాజమాన్యం, కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, మేయర్‌ మ్లాడుతూ.. మిగిలిపోయిన భోజనాన్ని సమీపంలో ఉన్న రిఫ్రిజిరేటర్‌ సెంటర్‌లో అందజేయాలని పిలపునిచ్చారు. ఆపన్నుల ఆకలి తీర్చేందుకు 'అన్నం పరబ్రహ్మం, సహకార ఆహారం' పేరిట సరికొత్త కార్యక్రమాన్ని నవంబర్ 26న మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు.

amrapali

ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లలో..

కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో తొమ్మిది ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌, మేయర్‌ చెప్పారు. నగరంలోని ఫంక్షన్‌ హాళ్ళు, హోటల్‌, గృహాల్లో మిగిలిపోయిన భోజనాలు తమ దగ్గర్లో ఉన్న రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి కావాల్సిన వారికి ఉచితంగా అందజేయనున్నట్లు కలెక్టర్‌ అమ్రపాలి, మేయర్‌ నన్నపునేని నరేందర్‌ వివరించారు. నవంబర్ 26న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని వారు ప్రకించారు.

రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేయనున్న కేంద్రాలివే..

ఎంజీఎం సెంటర్‌, హన్మకొండ బస్టాండ్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌, కాజీపేట రైల్వే స్టేషన్‌, హన్మకొండ కలెక్టర్‌ే, పాలమూరు గ్రిల్‌ సెంటర్‌, పోచమ్మ మైదాన్‌ కేంద్రాలతోపాటు మరో రెండు సెంటర్లు గుర్తించి రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతీ కేంద్రం నిర్వహణ బాధ్యత ఆయా ప్రాంతాల్లోని హోటల్‌ యాజమాన్యం వహిస్తుందని తెలిపారు.

సిటీ గ్రాండ్‌, తైలాన్‌ బాబా, హవేలీ, గ్రాండ్‌ సిీ. పాలమూరజిను గ్రీన్‌, రత్నా హోటల్‌తోపాటు మరికొన్ని హోటల్‌లు ఈ సెంటర్ల నిర్వహణకు ముందుకొచ్చాయని తెలిపారు. కోకకోలాతో పాటు ఇతర కంపెనీలు రిఫ్రిజిరేటర్‌లను ఉచితంగా అందించనున్నాయన్నారు. జేసీ దయానంద్‌ పాల్గొన్నారు.

English summary
A new programme will launch for hungry people in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X