హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్ .. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు త్వరలోనే రానున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్ కూయడంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే పరిషత్ ఎన్నికలు కూడా ముగియనుండటంతో జూన్ నుంచి కొత్త కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

అంతా అనుకున్నట్లు జరిగితే.. జూన్ మొదటి వారం నుంచే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు ఇదివరకు అప్లై చేసుకున్నవారికి కూడా కార్డులు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హరీష్ రావు సైలెంట్‌గా ఏమి లేడు.. ఏం చేస్తుండో నిన్న బయటపడిందిగా..!హరీష్ రావు సైలెంట్‌గా ఏమి లేడు.. ఏం చేస్తుండో నిన్న బయటపడిందిగా..!

అర్హత ఉన్న లబ్ధిదారులకు 7 రోజుల్లోనే..!

అర్హత ఉన్న లబ్ధిదారులకు 7 రోజుల్లోనే..!

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల కోడ్ ముగియడంతోనే కొత్త కార్డులు ఇచ్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించి పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేశారు. కార్డుల జారీలో జాప్యం తగదని.. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

గతేడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొన్ని రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. అనంతరం వరుస ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ కారణంగా కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే దరఖాస్తు చేసుకున్న చాలామందికి కార్డులు రాక నిరాశతో ఉన్నారు. మరికొంతమంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వనుంది. అదలావుంటే, అర్హత ఉన్న లబ్ధిదారులకు కేవలం ఏడు రోజుల్లో కార్డులు జారీ చేసేలా సన్నద్ధమవుతున్నారు అధికారులు.

ఎక్కడుంటే అక్కడే సరుకులు..!

ఎక్కడుంటే అక్కడే సరుకులు..!

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెడతారు. అందుకే రేషన్ కార్డు కావాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు, ఇదివరకు ఏ ఊళ్లోనైతే రేషన్ కార్డు ఉంటుందో అక్కడే సరుకులు తీసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ బయో మెట్రిక్ విధానంతో పాటు పోర్టబిలిటీ అమల్లోకి రావడంతో ఆ బాధ తప్పింది. దాంతో కూడా రేషన్ కార్డుల కోసం ఎగబడుతున్నారు.

ఉపాధి నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డవారు సైతం.. రేషన్ సరుకుల కోసం సొంత గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పోర్టబిలిటీ కారణంగా నగరంలోనే రేషన్ సరుకులు తీసుకునే సౌలభ్యముంది.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు..!

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు..!

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ కింది పత్రాలు ఉంటే సరిపోతుంది.

* అడ్రస్ ప్రూప్ : ప్రస్తుతం ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఇంటి అడ్రస్ కు సంబంధించి ఏదైనా ధృవీకరణ పత్రం
* ఐడెంటిటీ కార్డు : కుటుంబ యజమాని గుర్తింపు కార్డు.. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు.. వీటిలో ఏదో ఒకటి
* కుటుంబ యజమాని ఫోటో
* కుటుంబ యజమాని వయస్సు ధృవీకరణ పత్రం
* కుటుంబ యజమాని ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే 1,60,000.. పట్టణ ప్రాంతాలవారైతే 2,00,000 మించకూడదు.

మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు

మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు

మీకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాల్లో ఆన్ లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. మీ సేవాలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నెంబర్ కేటాయిస్తారు. మీ సేవా కేంద్రం వారిచ్చే దరఖాస్తు ఫారంతో పాటు కావాల్సిన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎమ్మార్వో ఆఫీసులో సమర్పించాలి. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వారు పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హులైన వారికి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నారు.

గతంలో జారీ చేసిన కార్డుల్లో తప్పులుంటే సరిదిద్ధుకోవడానికి కూడా అవకాశమిస్తున్నారు. అలాగే పాత కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు.

English summary
Telangana Government Decided To Issue New Ration Cards. From June 1st the process will be initiated. Elgible Candidates can apply fo r new ration cards in mee seva centres. Then MRO Office Employees enquires the applications and gives ration cards to elgible candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X