వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కొత్త ట్రెండ్ .. పిల్లల్లో కరోనా సోకిన మూడు, నాలుగు వారాలలో కూడా ప్రభావం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా కొత్త పోకడలతో ఇప్పుడు ప్రజలు,అటు వైద్యులు అయోమయానికి గురవుతున్నారు. అర్థం కాని రీతిలో కరోనా లక్షణాలు ఇప్పుడు చాలా మందిలో బయటపడుతున్నాయి. సహజంగా కరోనా వైరస్ సోకిన రెండు వారాలలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తే, ముఖ్యంగా పిల్లలలో మూడు, నాలుగు వారాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది . దీనిని చాలామంది తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు .

 ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులు ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులు

కరోనా కొత్త పోకడ .. పిల్లల్లో మూడు, నాలుగు వారాల్లో ప్రభావం

కరోనా కొత్త పోకడ .. పిల్లల్లో మూడు, నాలుగు వారాల్లో ప్రభావం

కరోనా కొత్త పోకడలు పోతోంది. రోజు రోజుకు కొత్త సవాళ్లను మానవ సమాజం మీదికి విసురుతోంది. కొందరు పిల్లల్లో కరోనా వైరస్ తొలి 14 రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా మూడు, నాలుగు వారాల్లో తీవ్రతరం అవుతుందని తాజాగా వస్తున్న కేసులను బట్టి తెలుస్తోంది. కరోనా వైరస్ సోకిన తొలిరోజుల్లో పెద్దగా లక్షణాలు కన్పించకుండా తగ్గిపోతున్న చిన్నారులలో చాలామంది, మూడు, నాలుగు వారాల తరువాత తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తో బాధ పడుతున్న చిన్నారులు

మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తో బాధ పడుతున్న చిన్నారులు

సాధారణంగా కరోనా దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే అవి మొదటి రెండు వారాల్లోనే కనిపిస్తాయి. కానీ అలా కాకుండా మూడు నాలుగు వారాల తర్వాత కూడా పిల్లల్లో ఈ దుష్ప్రభావాలు కనిపించడం ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సోకిన చాలా మంది చిన్నారులు 15 నుండి 30 రోజుల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్య ఎదురవుతోందని నిపుణులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలోనే గత నెల రోజుల్లో దాదాపు 26 మంది చిన్నారులు ఈ లక్షణాలతో జాయిన్ అయ్యారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రాందిచాల్సిందే

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రాందిచాల్సిందే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పటివరకు 4,400 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు.

కళ్లు ఎర్రబడటం, నాలుక, పెదాలు ఎర్రగా మారడం, ఒళ్లంతా దద్దుర్లు రావడం, కడుపు నొప్పి, 102 డిగ్రీల జ్వరం రావడం, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు చిన్నారులలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో కూడా కరోనాను గుర్తించుకుంటే చిన్నారుల ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

Recommended Video

India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
సకాలంలో చికిత్స తో పిల్లల్ల్లో కరోనాకు చెక్ పెట్టే ఛాన్స్

సకాలంలో చికిత్స తో పిల్లల్ల్లో కరోనాకు చెక్ పెట్టే ఛాన్స్

పిల్లలలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా కనిపించినప్పటికీ , వారిలో కరోనా లక్షణాలు కనిపించిన మూడు నాలుగు వారాల తర్వాత కూడా ఇతర లక్షణాలు కనిపిస్తే, అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అయితే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి. పెద్దలకు కరోనా సోకి తగ్గినా , ఆ సమయంలో పిల్లల్లో ఒకటి,రెండు రోజుల పాటు లక్షణాలు కనిపించి తగ్గిపోవచ్చు . కానీ మళ్ళీ మూడు, నాలుగు వారాలలో అవి కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో చికిత్స పొందితే పూర్తిగా కరోనా నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

English summary
Corona is now confusing people and doctors alike with new trends. Unexplained corona symptoms are now manifesting in many people. Naturally.. occurring corona virus has a severe effect within two weeks of infection, especially in children at three to four weeks it has effecting severely . most of the parents didn't identifying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X