వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు: చేతులెత్తేసిన జీ గ్రూప్, తెరపైకి ఎస్పీ నేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటామని గతంలో చెప్పిన జీఎస్ఎల్ గ్రూప్ ఇప్పుడు వెనక్కి పోయింది. తాము అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఇందుకు గల కారణాన్ని కూడా వివరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కంటే అప్పులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని విచారణలో భాగంగా సోమవారం హైకోర్టుకు జీఎస్ఎల్ గ్రూప్ వెల్లడించింది.

New twist in Agrigold case

అంతేకాదు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌ను కూడా తెరపైకి తీసుకు వచ్చింది. సంయుక్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి ఉందని అమర్ సింగ్ చెప్పారని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది.

సమాజ్ వాది పార్టీ నేతతో మాట్లాడుతామని వెల్లడించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నేరుగా మీరు అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటారా లేదా రెండు వారాల్లో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
New twist in Agrigold case. On Monday essel zee troup says they are not ready to takeover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X