• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మా ఎన్నికల్లో మెగా ట్విస్ట్ : ఏకగ్రీవం దిశగా అడుగులు : మాట వింటే సరి..లేకుంటే..!!

By Lekhaka
|

మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికలు..సాధారణ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయి. పోటీ పెరుగుతోంది. వర్గాలు అంటూ చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ వాదాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో..తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలకు ఇది సమస్యగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఈ స్థాయిలో చర్చ..రచ్చ జరుగుతుంటే...రానున్న రోజుల్లో ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుదో అనే ఆలోచన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే అయిదుగురు తాము మా అధ్యక్ష బరిలో నిలుస్తున్నామని ఓపెన్ గా ప్రకటించారు.

 ప్రకాశ్ రాజ్ కు మద్దతెవరెవరు..

ప్రకాశ్ రాజ్ కు మద్దతెవరెవరు..

ప్రకాశ్ రాజ్ ఏకంగా తమ ప్యానెల్ సభ్యులను సైతం పరిచయం చేసారు. అయితే, ప్రస్తుత మా కార్యవర్గ కాల పరమితి ముగియకుండానే..నరేష్ టీం లో సభ్యులుగా ఉన్న వారు కొత్త టీంలో ప్యానెల్ సభ్యులుగా ఎలా ముందుకొస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక, తెలుగు ఇండస్ట్రీలో ఎంత రహస్యంగా ఉంచినా.. వర్గ పోరు అందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు మరో సారి పోటీ దారుల వెనుక వర్గాల అంశం పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు అయినా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో విభజన జరగలేదనే వాదన ముందుకు వచ్చింది. ఇప్పటికిప్పుడు వెంటనే సాధ్యం కాకున్నా..కూర్చొని మాట్లాడి రెండుగా చేయాలనే సూచనలు వస్తున్నాయి. ఇదే సమయంలో మా లో తొమ్మది మంది తెలంగాణ ప్రాంత కళాకారులకు మా ప్యానెల్ లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.

 సినీ పెద్దల్లో అంతర్మధనం..

సినీ పెద్దల్లో అంతర్మధనం..

దీంతో..తాజాగా, మా అభ్యర్ధుల గెలుపులో ఆయనే కీలకమనే ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ హీరో ఈ పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మా నూతన కార్యవర్గ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో..పోటీలో ఎవరు ఉండబోతున్నారనే విషయం స్పష్టత వచ్చిన తరువాత ఒక్కొక్కరితో విడి విడిగా మాట్లాడి..పోటీ విషయంలో వారందరిలోనూ ఏకాభిప్రాయానికి ప్రయత్నించాలని ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని మా ప్రెసిడెంట్ గా చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి సైతం మహిళా అభ్యర్దిని అధ్యక్షురాలిని చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను నరేష్ లాంటి వారు గుర్తు చేస్తున్నారు.

 చిరంజీవి ప్రతిపాదనపైనే చర్చ..

చిరంజీవి ప్రతిపాదనపైనే చర్చ..

తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ సైతం మహిళను ఏకగ్రీవంగా అధ్యక్షురాలిని చేద్దాం అంటూ ఈ పోటీ సమయంలో ప్రతిపాదించారు. ఇక, ఈ ప్రతిపాదన పైన ప్రకాశ్ రాజ్ శిబిరం నుండి మాత్రం స్పందన రాలేదు. పోటీలో ఉంటున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. ఆయన ఇప్పటికే సూపర్ స్టార్ క్రిష్ణ మద్దతు కోరారు. ఇక, జీవిత..హేమ తో పాటుగా సీవీఎల్ నర్సింహా రావు సైతం పోటీలో ఉన్నారు. ఈ సమయంలో పోటీలో నిలిచిన ఈ అయిదుగురి తో పాటుగా అందరినీ ఒప్పించేందుకు ఒక ప్రణాళిక సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

 మహిళా అభ్యర్దికి అందరూ మద్దతుగా..

మహిళా అభ్యర్దికి అందరూ మద్దతుగా..

పోటీలో ఉన్న వారు కాకుండా..అందరికీ ఆమోద యోగ్యమైన ఒక మహిళా అభ్యర్ధి ని ఏకగ్రీవంగా ప్రతిపాదించే అంశం పైన సినీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందు కోసం అటు చిరంజీవి శిబిరానికి అభ్యంతరం లేకుండా...క్రిష్ణ ఫ్యామిలోతూనే సత్సంబంధాలు ఉంటూ..మోహన్ బాబు సైతం అంగీకరించే వ్యక్తి పేరు పైన చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అందు కోసం ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న జయసుధ పేరు ప్రతిపాదించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మెగా ఆలోచన పైన అందరి అభిప్రాయాలు తీసుకొని..సానుకూలత కనిపిస్తే ఆ ప్రముఖ హీరో బయటకు వచ్చి అధికారికంగా ఈ ప్రకటన చేయనున్నారు.

 ఏకగ్రీవం సాధ్యమయ్యేనా..

ఏకగ్రీవం సాధ్యమయ్యేనా..

అదే విధంగా ప్రాంతీయ వాదాలకు అవకాశం లేకుండా.. సమ ప్రాతినిధ్యం కల్పించేలాగా నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. వీటి పైన త్వరలోనే కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో భిన్నాభిప్రాయలు వ్యక్తం అయి..అది సాధ్యం కాని పరిస్థితుల్లో తాను ఎన్నికల వ్యవహారంలో దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఆలోచన..కార్యాచరణ..నిర్ణయానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో...ఇప్పుడు అటు మెగాస్టార్... మోహన్ బాబు..సూపర్ స్టార్ క్రిష్ణ వేసే అడుగుల వైపు తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తిగా చూస్తున్నాయి.

English summary
New twist in Maa elections.News making rounds that Tollywood biggies wants to give a good end for This controversial elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X