హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ధైర్యంగా ముందుకొస్తే: నటి కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్, యోగికి బెయిల్ అంతలోనే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ నటిని వేధించిన కేసులో అరెస్టయిన షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగికి మియాపూర్ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పత్రాలు సమర్పించకపోవడంతో జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే.

చదవండి: నటిపై యోగి వేధింపుల కేసులో మరో ట్విస్ట్: కీలక మెసేజ్‌లివే, యోగి అరెస్ట్

ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ సొంత పూచీకత్తులు సమర్పించకపోవడంతో అతనిని జైలుకు తరలించారు. యోగిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు అన్నీ సమర్పిస్తే గురువారం విడుదలయ్యే అవకాశముంది.

నేను ఏ తప్పు చేయలేదు

నేను ఏ తప్పు చేయలేదు

యోగి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. తనను పోలీసు అధికారి కొడుతుంటే ఆమెనే వీడియో తీసిందని తెలిపారు. కాగా, అంతకుముందు అతను ఫిర్యాదు చేసిన నటి తనతో చేసిన వాట్సాప్ సంభాషణలను మీడియాకు లీక్ చేసిన విషయం తెలిసిందే. ఇవి కలకలం రేపుతున్నాయి.

నేను ధైర్యంగా ముందుకొచ్చి చెబితే

నేను ధైర్యంగా ముందుకొచ్చి చెబితే

దీనిపై సదరు నటి మాట్లాడుతూ.. అవన్నీ నిజం కాదని చెప్పారు. తనలాంటి వారిని మరికొందరిని యోగి వేధిస్తున్నాడని చెప్పేందుకే తాను ధైర్యంగా ముందుకు వచ్చానని చెప్పారు. ఇప్పుడు తన క్యారెక్టర్ పైన మచ్చ వేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశాల్లో ఎంజాయ్ చేయాలని

విదేశాల్లో ఎంజాయ్ చేయాలని

తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని, జీవితంపై విసుగొచ్చి విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఆమె సందేశాలు పెట్టినట్లుగా యోగి విడుదల చేసిన విషయం తెలిసిందే. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలని అడిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మొబైల్ స్క్రీన్ షాట్లను పోలీసులకు పంపించిన విషయం తెలిసిందే.

బూటుకాలితో తన్నినందుకు వేటు

బూటుకాలితో తన్నినందుకు వేటు

ఇదిలా ఉండగా, ఈ కేసులో షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగిని కాలితో తన్నిన షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిపై వేటు పడిన విషయ తెలిసిందే. ఆయనను సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు బదలీ చేశారు. యోగిని గంగిరెడ్డి బూటు కాలితో తన్నిన విషయం తెలిసిందే.

విచారణ చేసి చర్యలు

విచారణ చేసి చర్యలు

ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ అయింది. దీంతో సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య విచారణ జరిపించి, చర్యలు తీసుకున్నారు. గంగిరెడ్డి ప్రవర్తన సరికాదని భావించి అతనిపై చర్యలు తీసుకున్నారు.

English summary
Short film actress complained of director Yogi's harassment in Guchibowli PS. There surfaced a New twist in this case as Director Yogi revealed her Whatsapp Messages in which she shared with Yogi about her not being happy personally and questioning him about living with values, when not happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X