వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త కోణాలు: రాజయ్యకు టిక్కెట్ ఇవ్వొద్దని సారిక లేఖ, భర్తకు వివాహేతర సంబంధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మృతిలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజయ్యకు టిక్కెట్ ఇవ్వవద్దని సారిక లేఖ రాశారని, రెండు రోజుల క్రితం రాజయ్య ఇంటికి సారిక వచ్చారని, మంగళవారం రాత్రి రాజయ్య - సారికల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని తెలుస్తోంది.

రాజయ్యకు టిక్కెట్ ఇవ్వొద్దు: ఏఐసీసీకి సారిక లేఖ

వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో తన మామ, సీనియర్ కాంగ్రెస్ నేత రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వవద్దని కోడలు సారిక ఏఐసీసీకి నాలుగు రోజుల క్రితం లేఖ రాసిన విషయం వెలుగు చూసింది. తనను రాజయ్య కుటుంబం రోడ్డున పడేసిందని, కాబట్టి టిక్కెట్ ఇవ్వవద్దని అందులే పేర్కొన్నారు.

 New twists in Rajaiah's Daughter in Law death case

సారిక భర్త అనిల్‌కు మరొకరితో వివాహేతర సంబంధం

సారిక భర్త అనిల్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజయ్య కుటుంబానికి, కోడలు సారికకు ఎప్పుడు సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సారిక భర్త మరొకరితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు, రెండు రోజుల క్రితమే సారిక ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

కాగా, మాజీ ఎంపీ, వరంగల్‌ లోకసభ కాంగ్రెస్‌ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభినవ్‌(7), అమోన్‌(3), శ్రీయోన్‌(3)లు మృతి చెందారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తుసిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, ఏఎస్పీ జానయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసు జాగిలాల సాయంతో ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు.

English summary
New twists in Congress leaders Rajaiah's Daughter in Law death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X