హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యూఇయర్: కార్లన్నీ ఖరీదైనవే, పోలీసులను వేడుకున్న యాంకర్ ప్రదీప్, ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త ఏడాది 2018 సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూఇయర్ పేరుతో కొందరు యువకులు మద్యం మత్తులో జోగుతారనే విషయం తెలిసిందే. కొత్త ఏడాది అసలు మందు, పబ్బు కోసమే అన్నట్లుగా ఉంది.

Recommended Video

ఐశ్వర్య రాయ్‌కి కొడుకా ? సాక్ష్యాలు కూడా ఉన్నాయట..

అందుకే ఇలాంటి న్యూఇయర్‌ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆనందంగా చేసుకుంటేనే పండుగ. కానీ పూటుగా తాగి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సరికాదనేది చాలామంది అభిప్రాయం. న్యూఇయర్ 2018 సందర్భంగా కూడా చాలామంది యువత పబ్బులు, క్లబ్బులలో ఎంజాయ్ చేశారు.

 రికార్డ్ తనిఖీలు, వాహనాలు సీజ్

రికార్డ్ తనిఖీలు, వాహనాలు సీజ్

హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్కరోజే హైదరాబాదులో 55,540 వాహనాలను తనిఖీ చేశారు. 1683 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

 ట్రాఫిక్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లే

ట్రాఫిక్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లే

న్యూఇయర్ పేరుతో పోలీసులకు పట్టుబడిన కార్లలో ఎక్కువగా ఖరీదైనవే ఉండటం గమనార్హం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం తాగితే నిందితులకు జైలు శిక్ష పడ అవకాశముంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే పబ్బులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎక్కువగా దొరికారు.

 మోతాదుకు మించి మూడింతలు తాగారు

మోతాదుకు మించి మూడింతలు తాగారు

కాగా, నటుడు ప్రదీప్ మద్యం తాగి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్ అనలైజర్ టేస్టులో ప్రదీప్‌ది 178 పాయింట్ల రీడింగ్ నమోదయింది. ప్రదీప్ మోతాదుకు మించి మూడింతలు మద్యం తాగారు. ఇలా మద్యం తాగిన వారికి ఐదు రోజుల జైలు శిక్ష పడవచ్చునని అంటున్నారు.

డ్రైవర్ లేకుండా ప్రదీప్

డ్రైవర్ లేకుండా ప్రదీప్

ప్రదీప్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో దొరికిపోయారు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చిన అతను, మందు తాగితే డ్రైవర్లను చూసుకోవాలని ముందే హెచ్చరించిన పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ కారెక్కాడు. స్కోడా కంపెనీకి చెందిన టీఎస్ 07 ఈయూ 6666 కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కారు కనిపించింది.

 తనను వదిలేయాలని ప్రదీప్ అడిగినా నో చెప్పిన పోలీసులు

తనను వదిలేయాలని ప్రదీప్ అడిగినా నో చెప్పిన పోలీసులు

అనుమానాస్పదంగా ఉన్న వారికి మాత్రమే పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ప్రదీప్‌కు కూడా నిర్వహించారు. ఏం పేరు అని పోలీసులు అడగగా.. ప్రదీప్ అన్న సమాధానం చెప్పారు. ఈ లోగా అక్కడున్న మీడియా అటువైపు వచ్చింది. తనను వదిలేయాలని ప్రదీప్ అడిగినా పోలీసులు నో చెప్పారు. కారు పక్కన బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు.

 మరో వాహనంలో వెళ్లిన ప్రదీప్

మరో వాహనంలో వెళ్లిన ప్రదీప్

పోలీసులకు దొరకడంతో ప్రదీప్ తన కారును పోలీసులకు అప్పగించి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతనిని పోలీసులు కోర్టు ముందు హాజరు హాజరుపరచనున్నారు. కాగా, కొత్త సంవత్సరం ఆనందంలో పూటుగా తాగి రోడ్డెక్కిన వారందరికీ పోలీసులు షాకిచ్చారు.

English summary
Celebrations across India and beyond marked the beginning of 2018. From big cities to small towns, revellers were seen out on the streets making most of the night that bid adieu to 2017 and welcomes the new year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X