• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి: అదే ఉదృతి: కొత్త కేసులతో కలవర పాటు: ఇప్పటికింతే అనేలా!

|

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఎప్పట్లాగే కొనసాగుతోంది. సోమవారం విడుదలైన బులెటిన్‌తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించింది. మరోసారి రెండు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ రోజువారీ కేసులు రికార్డు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1896 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 82 వేలను దాటుకున్నాయి. షరా మామూలే అన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే అధిక కేసులు నమోదు అయ్యాయి.

Telangana Liberation day:నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి ఎలా కలిగింది..?

పంద్రాగస్టుకు కరోనా వ్యాక్సిన్‌పై ప్రకటన?: కేంద్రం సంకేతాలు: రవాణా, ప్రాధాన్యతలపై కమిటీ భేటీ

82 వేలను దాటిన కరోనా కేసులు..

82 వేలను దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1896 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 1788 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరుకుంది. ఇందులో 57,586 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 645కు పెరిగింది. యాక్టివ్ కేసులు 22,628గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్‌ను విడుదల చేసింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోంది.

 జీహెచ్ఎంసీలో తగ్గని దూకుడు

జీహెచ్ఎంసీలో తగ్గని దూకుడు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే తాజాగా వెలుగులోకి వచ్చిన పాజిటివ్స్ తక్కువే. అయినప్పటికీ అది నామమాత్రమే. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 338 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్-121, మేడ్చల్ మల్కాజ్‌గిరి-119, రంగారెడ్డి-147 కేసులు తాజాగా నమోదు అయ్యాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసులివే..

జిల్లాలవారీగా నమోదైన కేసులివే..

జిల్లాలవారీగా చూస్తే 24 గంటల్లో ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-60, జగిత్యాల-59, జనగామ-71, జయశంకర్ భూపాలపల్లి-20, జోగుళాంబ గద్వాల-85, కామారెడ్డి-71, కరీంనగర్-121 ఖమ్మం-65, కొమరం భీమ్ ఆసిఫాబాద్-17, మహబూబ్ నగర్-58, మహబూబాబాద్-23, మంచిర్యాల-11, మెదక్-14, మేడ్చల్ మల్కాజ్‌గిరి-119, ములుగు-23, నాగర్ కర్నూలు-7, నల్లగొండ-54, నారాయణపేట్-13, నిర్మల్-12, నిజామాబాద్-42,పెద్దపల్లి-66, రాజన్న సిరిసిల్ల- 38, రంగారెడ్డి-147, సంగారెడ్డి-49, సిద్ధిపేట్-64, సూర్యాపేట్-32, వికారాబాాద్-21, వనపర్తి-28, వరంగల్ రూరల్-35, వరంగల్ అర్బన్-95, యాదగిరి భువనగిరి-24 కేసులు నమోదు అయ్యాయి.

  V Hanumantha Rao About Ex MP Nandi Yellaiah | Oneindia Telugu
  తగ్గిన కరోనా శాంపిల్స్ టెస్టులు..

  తగ్గిన కరోనా శాంపిల్స్ టెస్టులు..

  24 గంటల వ్యవధిలో మొత్తం 18,035 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 6,42,875కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 17,315.8 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాంపిళ్ల పరీక్షలను మరింత పెంచుతామని, దీనికోసం మరిన్ని చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

  ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

  English summary
  Telangana reports Newly 1896 Covid 19 Coronavirus positive cases and 8 deaths in past 24 hours. Total 1788 Patients were discharged. Total positive cases is reached in Telangana at 82,647 and 645 deaths were reported.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X