భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు
తెలంగాణ అంతటా సాగునీరు పారించాలన్న సీఎం కేసీఆర్ భగీరథ యత్నాన్నిఆచరణలో అమలుచేస్తున్న నేత తన్నీర్ హరీశ్ రావు.. సీఎం కేసీఆర్‌కు మేనల్లుడు. 2004లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పని చేసిన హరీశ్ రావు తన మామ ప్రాతినిధ్యం వహించిన సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాటి నుంచి ఇప్పటివరకు సిద్ధిపేటలో తనకుంటూ ప్రత్యేక ఇమేజీ కల్పించుకుంటూ ప్రజలకు చేరువైన హరీశ్ రావు.. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.


తెలంగాణ రాాష్ట్ర సమితి (తెరాస)లో ఆయన ట్రబుల్ షూటర్‌గా ముందుకు వచ్చారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. మిషన్ భగీరథ పనులను మాత్రమే కాకుండా కాళేశ్వరం వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ సకాలంలో పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, ప్రజల్లో కలిసిపోతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తనకు కెసిఆర్ ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడంలో నిరంతరం శ్రమిస్తూ ప్రజల నోళ్లల్లో నానుతూ వస్తున్నారు.