వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

News Maker 2019: కేటీఆర్‌కు కలిసొచ్చిన సంవత్సరం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా సూపర్ సక్సెస్

|
Google Oneindia TeluguNews

2009 ఎన్నికలకు ముందు కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా పార్టీపై పూర్తి పట్టు మాత్రం కేటీఆర్ కు 2019లో దక్కిందని చెప్పాలి . 2019 కేటీఆర్ కు బాగా కలిసొచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా, పార్టీలో ట్రబుల్ షూటర్ గా, సీఎం కేసీఆర్ తర్వాత పార్టీలో కీలకమైన వ్యక్తిగా, రాబోయే కాలంలో కాబోయే సీఎం గా కేటీఆర్ కు ఈ సంవత్సరం చాలా బాగా కలిసొచ్చింది.పార్టీపై మంచి పట్టు తెచ్చి పెట్టింది.

 2019 లో పార్టీ శ్రేణులపై పట్టు సాధించిన కేటీఆర్

2019 లో పార్టీ శ్రేణులపై పట్టు సాధించిన కేటీఆర్

2009 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. సరిగ్గా ఏడాది కిందట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కీలక బాధ్యతలు అందుకున్న ఆయన 2019 లో పార్టీ శ్రేణులపై తన పట్టు నిలుపుకున్నారు. గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ దూకుడు చూపించారు. ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల వ్యూహాల్లో ఆయన కీలక భూమిక పోషించారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అపర చాణిక్యుడిలా కేటీఆర్

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అపర చాణిక్యుడిలా కేటీఆర్

వ్యూహాత్మక ప్రచారం నిర్వహించిన ఆయన మంత్రిగా కాస్త ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించినా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పని చేసిన ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చి సీఎం కేసీఆర్ కుమారుడికి పెద్ద పీట వేసి పార్టీలో నెంబర్ 2 కేటీఆర్ అని చెప్పారు. దీంతో కేటీఆర్ అప్పటి నుండి పార్టీని బలోపేతం చెయ్యటంతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా అపర చాణిక్యుడిలా ఎన్నికల విజయానికి కృషి చేస్తున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటి మీద నడిపిస్తున్నారు.

మంత్రి పదవి ఆలస్యంగా ఇవ్వటంతో చర్చ ... ఆ సమయాన్ని వృధా చెయ్యని కేటీఆర్

మంత్రి పదవి ఆలస్యంగా ఇవ్వటంతో చర్చ ... ఆ సమయాన్ని వృధా చెయ్యని కేటీఆర్

టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. హరీశ్ రావుకు కూడా మంత్రి పదవి కేటాయించలేదు. దీంతో ఇది పార్టీలో, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు కారణమైంది. ఏదో జరుగుతుంది అని అంతా భావించినా కేటీఆర్ మాత్రం వస్తున్న విమర్శలపై, వ్యాఖ్యలపై స్పందించలేదు .అయితే మంత్రి పదవి లేకపోవడంతో దొరికిన సమయాన్ని కేటీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించారు. పార్టీపై క్రమంగా పట్టు సాధించారు. ఇక ఇరువురికీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు లభించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వీడింది.

ఎన్నికలు ఏవైనా విజయం కోసం వ్యూహాలు రచించిన కేటీఆర్

ఎన్నికలు ఏవైనా విజయం కోసం వ్యూహాలు రచించిన కేటీఆర్

ఇక ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. పార్లమెంట్ నియోజకర్గాల వారీగా ఫలితాలు రాబట్టారు. కేటీఆర్ ఒక్క నిజామాబాద్ స్థానంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కవిత ఓటమి ఒకింత కేటీఆర్ కు మైనస్ . ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ ఘన విజయాన్ని సాధిం చింది . ఇటు మంత్రిగా, అటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రెండు జోడు పదవులను సమర్థంగా నిర్వహించి సమర్ధుడు అనిపించుకున్నారు కేటీఆర్.

పార్టీపై పట్టు, ప్రజల్లో నమ్మకం పెంచుకున్న కేటీఆర్

పార్టీపై పట్టు, ప్రజల్లో నమ్మకం పెంచుకున్న కేటీఆర్

ఇక అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.గులాబి బాస్ సీఎం కేసీఆర్ తన తర్వాత గులాబీ పార్టీలో తన కుమారుడికి ప్రాధాన్యత అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక సీఎం గానూ తన కుమారుడిని పరిచయం చేయాలని భావించిన కెసిఆర్ ముందు పార్టీపై పట్టు సాధించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యత ఆప్పగిస్తే సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించిన కేటీఆర్ పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, పార్టీలో అంతర్గత విభేదాల విషయంలోనూ, మంత్రివర్గ విస్తరణ సందర్భంలో సొంత పార్టీ నేతలలో తలెత్తిన వ్యతిరేకత నేపథ్యంలోనూ చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

English summary
Although KTR entered the political arena before the 2009 elections, the party's overall grip on the KTR is expected to reach 2019. In The 2019 KTR is well integrated. KTR as a working president, minister, troubleshooter in the party, a key figure in the party after CM KCR, and the future CM in the coming season, KTR has been proved himself in 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X