• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ పదవి వెనుక చంద్రబాబు : అటు కేసీఆర్..ఇటు జగన్ : కొత్త వ్యూహం..ఏపీకి లింక్ పెడుతూ..!!

By Lekhaka
|

ఎట్టకేలకు అనేక తర్జన భర్జనల తరువాత టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. చివరి దశలో రేవంత్ రెడ్డికి పోటీగా కోమటిరెడ్డి నిలిచారు. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పైన ఇప్పుడు టీ-కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆగ్రహంతో రగలిపోతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి జూలై 7న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, తాజాగా రేవంత్ నియామకం ..వెనుక జరగిన మంత్రాంగం పైన టీ కాంగ్రెస్ లో అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. అనూహ్యంగా చంద్రబాబు పేరుతో ఈ చర్చలు మొదలయ్యాయి.

  Revanth Reddy As TPCC President: Chandrababu Role ? | Oneindia Telugu
   చంద్రబాబుకు విధేయుడిగా..

  చంద్రబాబుకు విధేయుడిగా..

  రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ ఓటు కు నోటు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి నేరుగా అమరావతి వెళ్లి..ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. కానీ, ఆ లేఖను ఆమోదం కోసం చంద్రబాబు పంపలేదు. ఇక, అప్పుడే అనూహ్యంగా రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుండి పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు.

  టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ రాజీనామా సమయం నుండి రేవంత్ పేరు ప్రచారంలో ఉంది. కానీ, సీనియర్లు-రేవంత్ వ్యతిరేకులు మాత్రం చాలా కాలం రేవంతరెడ్డి పేరు ప్రకటించకుండా ఆపగలిగారు. ఇక, టీ-టీడీపీ చీఫ్ గా ఉన్న రమణ సైతం పార్టీని వీడటం ఖాయమైన తరువాత అనూహ్యంగా చంద్రబాబు రంగ ప్రవేశం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

   టెన్ జనపథ్ తో చర్చించారంటూ..

  టెన్ జనపథ్ తో చర్చించారంటూ..

  2019 లో మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు అన్ని పార్టీలను ఒకే తాట మీదకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ నివాసానికి వెళ్లి మరీ...మద్దతు ప్రకటించారు. తెలంగాణలో రాహుల్ తో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇక, ఫలితాల తరువాత చంద్రబాబు అంచనాలు తల కిందులు అయ్యాయి.

  అయితే, ఇప్పుడు తెలంగాణలో టీడీపీని అభిమానించే శ్రేణులు ప్రస్తుతం అక్కడ పార్టీ పరిస్థితి పైన ఆవేదనతో ఉన్నారు. కానీ, టీ-టీడీపీతో సహా..కేసీఆర్ వ్యతిరేకులు మాత్రం రేవంత్ రెడ్డికే పీసీసీ రావాలని బలంగా కోరుకున్నారు. ఇప్పుడు రేవంత్ కు పదవి ఖరారైన తరువాత ఆయన అనుచరులతో పాటుగా..టీ -టీడీపీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  ముందుగా తెలంగాణలో పాగా వేస్తే..

  ముందుగా తెలంగాణలో పాగా వేస్తే..

  తెలంగాణ లో టీడీపీని దెబ్బ తీసిన కేసీఆర్ ను ఎదుర్కోగల శక్తి రేవంత్ కు మాత్రమే ఉందనేది వారి నమ్మకం. ఇక, రేవంత్ కు పోటీ పెరగటం..ఏఐసీసీ అధినాయకత్వం వద్ద పంచాయితీ తెగక పోవటంతో చంద్రబాబు చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చారని..ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడి రేవంత్ కు పగ్గాలు ఇవ్వటం ద్వారా భవిష్యత్ ప్రయోజనాలు..రాజకీయ సమీకరణాలను వివరించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

  ఇదే అంశం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి టీడీపీని వీడినా ఏనాడు చంద్రబాబు పైన మాత్రం విమర్శలు చేయలేదు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉంటే...కాంగ్రెస్ తెలంగాణలో ఎదగుతుందని..దీంతో కేసీఆర్ కు చెక్ పెట్టంతో పాటుగా..బీజేపీ ఆశలు సన్నగిల్లుతాయంటూ టీ-టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

  ఏపీలోనూ ప్రభావం ఉంటుందంటూ..

  ఏపీలోనూ ప్రభావం ఉంటుందంటూ..

  తెలంగాణలో రేవంత్ సారధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొట్టి పారిలేయమంటున్నారు. పదేళ్ల తరువాత టీఆర్ఎస్ మాత్రమే కాదని..ఏ పార్టీ అధికారంలో ఉన్న వ్యతిరేకత ఖాయమంటున్నారు. ఇక, వీటన్నింటినీ వివరిస్తూ ..ఇక్కడ ముందుగా కాంగ్రెస్ పుంజుకుంటే..ఏపీలోనూ కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకొనే అవకాశం ఉంటుందనే అంచనాలు వరు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నాటి కాంగ్రెస్..నేటి వైసీపీ నేతలు ఎవరైతే జగన్ పైన అసంతృప్తితో ఉన్నారో...వారు సొంత గూటికి వస్తారంటూ జోస్యం చెబుతున్నారు.

  ఇదే చంద్రబాబు ఏఐసీసీ ముఖ్యుడుకు వివరంచినట్లు ప్రచారం కొనసాగుతోంది. అయితే, ఇదంతా జరిగే పనేనా అనేది అసలు ప్రశ్న. ఇంత లోతుగా ఆలోచించే రేవంత్ కు పగ్గాలు దక్కేలా చంద్రబాబు తన వంతు సహకారం అందించారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి సైతం రేవంత్ నియామకం వెనుక చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించటం ఈ అనుమానాలను మరింత బలం ఇస్తోంది.

  English summary
  News is making rounds in political circles that Chandrababu's recommendation was there in appointing Revanth Reddy as TPCC chief
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X