వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనురాగ్ శర్మ వారసుడెవ్వరు: మహేందర్ రెడ్డి లేదంటే తేజ్‌దీప్?

వచ్చేనెలలో తెలంగాణ మలి విడత డీజీపీ ఎంపిక కానున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి, ‘షీ’ టీమ్స్ పనితీరును సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తొలి డీజీపీగా నియమితులైన అనురాగ్ శర్మ పదవీకాలం ముగింపుకొస్తోంది. వాస్తవంగా గత ఫిబ్రవరిలోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం మంజూరు చేసిన ఎనిమిది నెలల పాటు పొడిగింపు.. ఈ నెలాఖరుతో ముగిసిపోనున్నది.

ఈ తరుణంలో వచ్చేనెలలో కొత్త డీజీపీ నియామకంపై సీఎం కే చంద్రశేఖర్ రావు దృష్టి సారించారు. రాష్ట్ర డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఉండే లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఇక అదనపు డీజీపీలుగా ఉన్న ఆశావాహ సీనియర్ ‌ఐపీఎస్‌ అధికారులు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు.

వచ్చే నెల నవంబర్‌లో ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ రిటైర్‌ కానున్నారు. గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేస్తే తమలో ఒకరికి డీజీపీగా ఛాన్స్‌ లభిస్తుందన్న ఆశతో పెట్టుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు.. ఎనిమిది నెలల పాటు అనురాగ్ శర్మ పదవీ కాలం పొడిగించడంతో నిరాశకు గురయ్యారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రజాతీర్పు అనుకూలంగా పొందాలని సీఎం కేసీఆర్ తల పోస్తున్నారు. తన ప్రభుత్వానికి అనువైన అధికారిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వాధినేత నిర్ణయాన్ని బయటకు ఐపీఎస్ అధికారులు సమర్థించేందుకు సిద్ధమని చెప్తున్నా.. కనీసం ఒకరిద్దరైనా 'క్యాట్'లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లలో ఇలా మార్పులు

జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లలో ఇలా మార్పులు

తాజాగా డీజీపీగా అనురాగ్ శర్మ వారసుడిగా ఎన్నికయ్యేందుకు పలువురు అదనపు డీజీ స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సీఎం కేసీఆర్‌ మాత్రం కొత్త డీజీ ఎవరు అవుతారనే విషయంలో తాను రోజు కలిసే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులే కాదు, ఐఏఎస్‌లతోనూ చూచాయగా నైనా మనసులో మాటను వెలిబుచ్చడం లేదని తెలిసింది. 2019లో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన కొత్త పోలీస్‌ బాస్‌‌ను ఎంపిక చేయనున్నారని వినిపిస్తోంది. ముఖ్యంగా తన పాలనలో పోలీసు వ్యవస్థ పట్ల దాని పటిష్టత పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే జిల్లాలు, నగర పోలీసు కమిషనరేట్‌లలో అవసరమైన మార్పులు చేర్పుల విషయమై దృష్టి సారించారు.

 ఎన్నికల్లో గెలుపుపైనే సీఎం కేసీఆర్ ఫోకస్

ఎన్నికల్లో గెలుపుపైనే సీఎం కేసీఆర్ ఫోకస్

అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ బాస్‌ ఎంపిక విషయంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన పలు జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీజీపీ రేస్‌లో రాష్ట్ర ఎస్‌పీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్‌ మీనన్‌ (1983), సీఆర్పీఎఫ్‌ డీజీ సుదీప్‌ లక్టాకియా (1984), కేంద్ర క్రైమ్‌ రికార్డు బ్యూరో డైరెక్టర్‌ ఈష్‌కుమార్‌ (1985)లతో పాటు 1986 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్‌లు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, హైదరాబాద్‌ కమిషనర్‌ ఎం మహేందర్‌రెడ్డి, కేంద్రంలో డిప్యుటేషన్‌పై ఉన్న ఆలోక్‌ ప్రభాకర్‌, రాష్ట్ర రైల్వే, రోడ్‌సేఫ్టీ డీజీపీ టీ కృష్ణప్రసాద్‌ ఉన్నారు.

 సీఎం కోరుకున్న అధికారికే డీజీపీగా చాన్స్

సీఎం కోరుకున్న అధికారికే డీజీపీగా చాన్స్

నిజానికి సీనియారిటీ ప్రకారం డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు మొదలు ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ వరకు సీనియారిటీ కంటే శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థతకు పెద్దపీట వేసి తాము కోరుకున్న అధికారికే డీజీపీ పగ్గాలను అప్పగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా సీనియారిటీ కంటే తాము కోరుకున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికే పోలీస్‌ చీఫ్‌ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది.

 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ పోలీసుకు అభినందనలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ పోలీసుకు అభినందనలు

ముఖ్యంగా ఇటీవలే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అత్యధికంగా సీట్లను గెలిచి, మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి హైదరాబాద్‌ సిటీ పోలీసులు, షీ టీమ్‌లు ప్రజల అభిమానాన్ని చూరగొనడమే కారణమని సీఎం కేసీఆర్‌ ఒక సమావేశంలో ప్రకటించారు కూడా. హైదరాబాద్ నగర సీపీ మహేందర్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు కూడా.

 పోటీ పడుతున్న లక్టాకియా, త్రివేది

పోటీ పడుతున్న లక్టాకియా, త్రివేది

అనురాగ్ శర్మ వారసుడిగా డీజీపీ పోస్టు మహేందర్ రెడ్డినే వరించబోతున్నదని పోలీసుశాఖలో చర్చ సాగుతున్నది. మరో వైపు నిజాయితీ పోలీస్‌ అధికారిగా పేరున్న సీఆర్‌పీఎఫ్‌ డీజీ సుదీప్‌ లక్టాకియా , రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేదీ పేర్లు కూడా ఐపీఎస్‌ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి డీజీపీగా పదోన్నతి రాగానే సీఆర్పీఎఫ్‌కు వెళ్లిన సుదీప్‌ లక్టాకియా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చీఫ్‌ పోస్టును ఆశించారని తెలిసింది. కాని కేంద్ర ప్రభుత్వం మరో సీనియర్‌ ఐపీఎస్‌కు ఆ ఛాన్స్‌ ఇవ్వడంతో లక్టాకియా తిరిగి రాష్ట్రానికి రావాలనే యోచనలో ఉన్నారని వినికిడి.

సీఎం విచక్షణాధికారంపైనే డీజీపీ ఎంపిక

సీఎం విచక్షణాధికారంపైనే డీజీపీ ఎంపిక

మరో అందరికంటే సీనియరైన ఎస్‌పీఎఫ్‌ చీఫ్‌ తేజ్‌దీప్‌మినన్‌ సైతం తన అవకాశాన్ని కూడా పరీక్షించుకుంటున్నట్టు తెలిసింది. అదే వరుసలో రాజీవ్‌ త్రివేది, కృష్ణ ప్రసాద్‌ సైతం అవకాశం ఇస్తే తాము ఆ బాధ్యతను మోయడానికి సిద్ధమంటూ తమ సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. డీజీపీ పోస్టుకు అర్హులైన ఏడుగురు అధికారుల్లో కొందరు మాత్రం తమలో ఎవరికి డీజీపీ పోస్టు దక్కినా సంతోషమేనని, అది పూర్తిగా రాష్ట్ర సీఎం విచక్షణాధికారమని, దానిని ఎవరైనా గౌరవించాల్సిందేనని అంటున్నట్టు తెలిసింది.

 సీనియర్ ఐపీఎస్‌లతో ఇలా జాబితా సిద్ధం

సీనియర్ ఐపీఎస్‌లతో ఇలా జాబితా సిద్ధం

అదే సమయంలో డీజీపీ వంటి కీలక పదవిని నిర్వహించాలని ప్రతి ఒక్క ఐపీఎస్‌ అధికారి ఆశ అని అందుకు అవకాశం ఇస్తే వదులుకోగలమా? అని తెర వెనుక సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిసింది. కాగా వచ్చే నెలలోనే కొత్త డీజీపీని ఎంపిక చేయాల్సి ఉండటంతో నిబంధనల ప్రకారం అర్హులైన ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ఒక జాబితాను కేంద్ర యూపీఎస్‌సీకి వారంలో రాష్ట్ర సర్కార్ పంపించిందని సమాచారం.

 ఒకరిద్దరు ఐపీఎస్‌లు ‘క్యాట్'కు వెళ్లే చాన్స్

ఒకరిద్దరు ఐపీఎస్‌లు ‘క్యాట్'కు వెళ్లే చాన్స్

అనురాగ్ శర్మ వారసుడిగా కొత్త డీజీపీ ఎంపికకు అవసరమైన కసరత్తును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పూర్తి చేసినట్టు తెలిసింది. పంపిన జాబితాలో ముగ్గురు అధికారులను యూపీఎస్‌సీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. అందులో నుంచి ఒకరిని డీజీపీగా సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారు. ఒక వేళ సీనియారిటీని పక్కన బెట్టి డీజీపీ ఎంపిక జరిగిన పక్షంలో ఒకరిద్దరు సీనియర్‌ అధికారులు క్యాట్‌లో సవాల్‌ చేసే అవకాశాలు కూడా లేక పోలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

English summary
Telangana state will gets next director general of police (dgp). Present DGP Anurag Sharma tenure will retire with this month. Senior IPS officials are openly said accepted government decision. CM KCR interested on Hyderabad CP Mahender Reddy and then others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X