• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసుల్లో ఉన్న వ్యక్తికి పదవి ఎట్లిస్తరండీ.!రేవంత్ కి పీసిసి అని నేనెట్ల చెప్త.?చెప్పకనే అన్నీ చెప్పేసిన వీహెచ్

|

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కస్త అభద్రతాబావానికి లోనయ్యారు. తాను ఏం మాట్లడుతున్నారో సంయమనంలో కోల్పోయి మాట్లడుతున్నట్టు అనిపించింది. గురువారం ఉదయం అంబర్ పేటలోని తన నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన హనుమంత రావు పీసిసి ఛీఫ్ ప్రకటన, పీసిసి అధ్యక్ష్య పదవి ఎవరిని వరించింది, అధిష్టానం ఎవరిని ఖరారు చేసింది అనే అంశాల పట్ల ఘాటుగా స్పందించారు. తాను ఏమీ చెప్పనట్టే అన్నీ అంశాలను చెప్పుకొచ్చారు. తనకు ఇష్టం లేని రేవంత్ రెడ్డికి పీసిసి పదవి ఇచ్చినట్టు చెప్పి, అబ్బే ఆ అంశం పట్ల అదిష్టానం ప్రకటన చేయాల్సి ఉందని ఆ వెంటనే చెప్పుకొచ్చారు.

ప్రెస్ మీట్ లో స్పష్టత కోల్పోయిన వీహెచ్.. పిసీసీ అధ్యక్షుడి గురించి క్లారిటి ఇచ్చిన హనుమంతన్న..

ప్రెస్ మీట్ లో స్పష్టత కోల్పోయిన వీహెచ్.. పిసీసీ అధ్యక్షుడి గురించి క్లారిటి ఇచ్చిన హనుమంతన్న..


ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విలేఖరుల సమావేశంలో తడబడ్డారు. ఖంగారుపడ్డారు. ఆవేశపడ్డారు. అక్కసువెళ్లగక్కారు. అయిష్టాన్న వ్యక్తం చేసారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. అసలు కథను మీడియా మీద, సోషల్ మీద నెట్టాలని ప్రయత్నించి ఉన్న కథనంతా చెప్పకనే చెప్పేసారు. ఎప్పటినుండో నానుతున్న పీసిసి అధ్యక్ష పదవిని అధిష్టానం ఖరారు చేసినట్టు, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ గతంలో జరిపిన చర్చలు కాకుండా తెలంగాణ సీనియర్ నేతలతో మరొక్కసారి పీసిసి అంశంలో చర్చలు జరపి తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పీసిసి ఖరారు కానప్పుడు ఎందుకు ఆందోళన.. ఖంగారుపడి అన్నీ చెప్పేసిన వీహెచ్..

పీసిసి ఖరారు కానప్పుడు ఎందుకు ఆందోళన.. ఖంగారుపడి అన్నీ చెప్పేసిన వీహెచ్..


అంటే తెలంగాణ పీసిసి అధ్యక్షుడి పదవి ఖరారయ్యిందని, తాను మొదటినుండీ వ్యతిరేకిస్తున్న వ్యక్తికే పదవి కట్టబెట్టారని వి.హనుమంత రావు చెప్పకనే చెప్పేసారు. ఒక సందర్బంలో తనకు ఢిల్లీ నుండి ఫోన్ ద్వారా విషయం తెలిసిందవన్న వీహెచ్ మరో సందర్బంలో మీడియా, సోషల్ మీడియా రేవంత్ రెడ్డికి పీసిసి ఇచ్చినట్టు కోడై కూస్తోంది కాబట్టి స్పందిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేసారు. తర్వాత రేవంత్ అనుచరులు తనను దుర్బాషలాడుతున్నారని ఆ అంశాన్ని ఖండించడానికి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఏది చెప్పాలని ప్రయత్నాలు చేసినప్పటికి రేవంత్ రెడ్డి కి పీసిసి పదవి చుట్టే ఆయన ప్రదక్షిణలు చేసినట్టు స్పష్టం అవుతోంది.

రెడ్డి సామాజిక వర్గానికి వద్దు.. పీసిసి బీసిలకివ్వాలన్న వీహెచ్..

రెడ్డి సామాజిక వర్గానికి వద్దు.. పీసిసి బీసిలకివ్వాలన్న వీహెచ్..


విలేఖరుల సమేవేశం జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో నియంత్రణ కోల్పోయి మాట్లాడారు వీహెచ్. అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్న వ్యక్తికి పిసీసీ పదవి ఎలా కట్టబెడతారని అదిష్టానం మీద వీహెచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. బడుగు బలహీన వర్గాలకు పీసిసి పదవి కట్టబెట్టాలి గాని ఉన్నత సామాజిక వర్గాలకే మళ్లీ ఎలా పీసిసి ఇస్తారని ప్రశ్నించారు. ఇదంతా తాను మీడియా, సోషల్ మీడియా కథనాలు చూసి స్పందిస్తున్నాను అని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. తాను చెప్పాలని ప్రత్నించిన అంశానికి చెప్పిన అంశానికి పొంతన లేకుండానే ప్రెస్ కొనసాగింది.

  TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
  పరోక్షంగా రేవంత్ రెడ్డికే పీసిసి పగ్గాలన్న వీహెచ్.. రేవంత్ వల్ల పార్టీకి నష్టమన్న పెద్దాయన..

  పరోక్షంగా రేవంత్ రెడ్డికే పీసిసి పగ్గాలన్న వీహెచ్.. రేవంత్ వల్ల పార్టీకి నష్టమన్న పెద్దాయన..


  చివరికి రేవంత్ రెడ్డికి పిసీసీ పదవి ఖరారయ్యిందా..? మీరెందుకు రేవంత్ మీద గానీ, అదిష్టానం మీద గాని, మానిక్కం ఠాగూర్ మీద గాని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. కేవలం మీడియా కథనాల వల్లే తాను స్పందిస్తున్నానని, పీసిసి అభ్యర్ధి అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అదిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. మొత్తానికి వీహెచ్ లోని ఆవేదన, ఆక్రోశం వెనక తెలంగాణ పీసిసి అభ్యర్ధని ఖరారు చేసిన సంకేతాలు కనిపించాయి. పీసిసి అభ్యర్ధి సమర్ధవంతుడు కాదు, అదిష్టానం నిర్ణయం సరైంది కాదనే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా తెలిసిపోయింది. సో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతన్న పీసిసి కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డేనని చెప్పకనే చెప్పేసారు.

  English summary
  Senior Congress leader V Hanumantrao was subjected to some insecurity. He seemed to be losing his temper and saying what he was saying.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X