వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిపేయండి: కేసీఆర్‌కు గట్టి షాక్

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. వెంటనే ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ - జాతీయ హరిత ట్రైబ్యునల్) గురువారం మధ్యంతర ఉత్తర్వులు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. వెంటనే ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ - జాతీయ హరిత ట్రైబ్యునల్) గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాతే ప్రాజెక్టు

ఆ తర్వాతే ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు వచ్చే వరకు దీనిని నిలిపివేయాలని ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో ఎన్జీటీ పేర్కొంది. అనుమతులు వచ్చాక ప్రారంభించుకోవచ్చునని అభిప్రాయపడింది.

Recommended Video

TRS and Congress workers Throw Chairs at each Other, Video
అటవీ భూములను

అటవీ భూములను

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎంత మేరకు అటవీ భూములను వినియోగిస్తున్నారో చెప్పాలని జస్టిస్ జావెద్ రహీమ్ నేతృత్వంలోని బెంచ్ గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది.

 అతి తక్కువ మేర అటవీ భూములు

అతి తక్కువ మేర అటవీ భూములు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అతి తక్కువ మేర అటవీ భూములు ఉన్నట్లు కౌంటర్ అఫిడవిట్లో తెలిపింది. ప్రస్తుతం వాటిలో ఎలాంటి నిర్మాణాలు జరపడం లేదని, పూర్తి అనుమతులు వచ్చాకే ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.

ప్రత్యామ్నాయ అడవులు

ప్రత్యామ్నాయ అడవులు

అంతేకాదు, అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూముల వివరాలు అందులో పొందుపర్చింది. వాటి స్థానాల్లో అడవులను అభివృద్ధి చేసేందుకు చర్యలను ప్రభుత్వం నివేదించింది. హెక్టారుకు 1600 మొక్కలు పెంచడానికి నిధులను ఇవ్వడం, అటవీ జంతువుల సంచారానికి ఇబ్బందులు లేకుండా చేపట్టే చర్యలను కూడా వివరించింది.

English summary
National Green Tribunal (NGT) interim orders to stop Kaleshwaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X