హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌కౌంటర్ మృతదేహాలను పరీశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం...ఏం తేలుస్తారో...?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన సంఘటనపై విచారించేందుకు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈనేపథ్యంలో ప్రత్యేక బృందం నిందితుల మృతదేహాలను పరీశీలించేందుకు మహబుబ్‌నగర్ ఆసుపత్రికి చేరుకుంది. పోస్ట్‌మార్టమ్‌ తర్వాత మార్చురిలో భద్రపరిచిన నాలుగు మృతదేహాలను విచారణ బృందం పరీశీలించింది. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత తీసుకున్న పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పరీశీలించారు. మరోవైపు శవపంచనామా రిపోర్ట్‌ను కూడ పరీశీలించి సంబంధిత డాక్టర్ల వివరాలు తెలుసుకోనున్నారు.

Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?

 మహబుబ్‌నగర్ ఆసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

మహబుబ్‌నగర్ ఆసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

అనంతరం మృతుల బంధువులను కూడ విచారించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రానికి చేరుకున్న బృందం ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని కూడ పరీశీస్తారని భావించారు. అయితే ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు మాత్రం నేరుగా మహబుబ్‌నగర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరమే సంఘటన జరిగిన చటాన్ పల్లికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిందితుల కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు కూడ గుడిగండ్లకు చేరుకునే అవకాశాలు కూడ కనిపిస్తోంది.

విచారణ తర్వాతే దహనసంస్కరణలు

విచారణ తర్వాతే దహనసంస్కరణలు

ఎన్‌కౌంటర్ మృతులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ ధాఖలు కావడంతో దహన సంస్కరాలు ఆగిపోయాయి. దీంతో హైకోర్టు విచారణ మరియు ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ తర్వాతే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అనంతరమే దహనసంస్కరాలు జరగనున్నాయి. కాగా దిశ ఎన్‌కౌంటర్ తర్వాత మీడియాలో వచ్చిన కథనాలతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది.

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు.. ఆసుపత్రి వద్ద బందోబస్తు...

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు.. ఆసుపత్రి వద్ద బందోబస్తు...

కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. దిశ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఏసీపీ సురేందర్ రావు సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసును నమోదు చేశారు.

మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ప్రసార మాద్యమాల ద్వార తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున జిల్లాస్పత్రికి చేరుకున్నారు. సంచలనం సృష్టించిన కేసు కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడుతుండంతో... జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి.. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సుమారు వంద మంది పోలీసులతో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు.

English summary
The NHRC team is touring in the state to inquire into the incident of an encounter in the disha murder case. team arrived at Mahabubnagar Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X