హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్దకు దిశ తల్లిదండ్రులు

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రెండు రోజులుగా విచారణ జరుపుతున్న బృందం దిశ తల్లిదండ్రుల వద్ద కూడ సమాచారం సేకరించనుంది. వారి స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డ్ చేసుకోనుంది. దీంతో ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల ముందు హజరైయ్యోందుకు పోలీసులు దిశ తల్లితండ్రులను తెలంగాణ పోలీసు అకాడమికి తరలించారు.

 రెండు రోజులుగా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

రెండు రోజులుగా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పర్యటన

శనివారం ఢిల్లి నుండి హైదారాబాద్ చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుండి నేరుగా శవాలను భద్రపరిచిన మహాబుబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి మార్చురికి చేరుకున్న సభ్యులు సుమారు మూడు గంటలపాటు ఫోరెన్సిక్ రిపోర్టులతో పాటు పంచనామా వివరాలను సేకరించారు. అనంతరం ఎన్‌కౌంటర్ సంఘటన స్థలాన్ని కూడ సందర్శించారు. ఇక నేడు దిశ కుటుంబ సభ్యలను కూడ విచారించనున్నారు. వారి స్టేట్‌మెంట్ సైతం రికార్డ్ చేసుకోనున్నారు.

దిశ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డ్

దిశ తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డ్

వాస్తవానికి ఎన్‌హెచ్‌ఆర్సీకి రాకను వ్యతిరేకిస్తున్న దిశ తల్లిదండ్రులు విచారణకు హజరుకావద్దని భావించారు. ఎందుకంటే దిశను దారుణంగా హత్య చేసి చంపినప్పుడు లేని మానవ హక్కులు, నిందితులను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే విచారణకు తమని ఇబ్బందిపెట్టవద్దని కోరారు. అయితే చట్టపరంగా కొనసాగుతున్న విచారణకు హజరుకావల్సి ఉండగా ఇందుకోసం సిద్దమయ్యారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు తాము ఒక బాధితురాలి కుటుంబ సభ్యులుగా జరిగిన అన్యాయాన్ని వారికి వివరిస్తామని చెప్పారు. దీంతో వారిని పోలీసులు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి తీసుకువచ్చారు.

ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ పోలీసుల స్టేట్‌మెంట్

ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ పోలీసుల స్టేట్‌మెంట్

మరోవైపు ఎన్‌కౌంటర్‌ ఘటనలో గాయపడి, కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ వద్ద కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ స్టేట్‌మెంట్‌ నమోదు చేసింది. కాగా ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను పూర్తిగా రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లో అనుమతించని పరిస్థితి నెలకొంది. మహబుబ్ నగర్‌ ఆసుపత్రి వద్దనే... మీడియాతో మాట్లాడతారని భావించినా... వారంతా విచారణలో నిమగ్నమయ్యారు. మొత్తం విచారణ పూర్తయిన తర్వాతే...వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

సోమవారమే మృతదేహాల అంత్యక్రియలు

సోమవారమే మృతదేహాల అంత్యక్రియలు

ఎన్‌కౌంటర్ తర్వాత హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను మార్చురిలోనే భద్రపరిచారు. ఎన్‌కౌంటర్ పై విచారణను సోమవారం హైకోర్టు చేపట్టనుంది. విచారణలో భాగంగా సోమవారం రాత్రీ ఎనిమిది గంటల వరకు మార్చురీలోనే భద్రపరిచాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ కూడ పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే... మృతులకు దహన సంస్కరణలు చేయనున్నారు.

English summary
NHRC team will also take the statement of Disha parents in encounter issue.they gathering information from the various source.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X