హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు:యాసిన్ భత్కల్ సహా 5గురికి ఉరిశిక్ష ఖరారు

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితులకు శిక్ష పైన ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నాడు న్యాయస్థానం యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితులకు శిక్ష పైన ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నాడు న్యాయస్థానం యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు ఈ శిక్షను విధించింది.

విధ్వంసానికి పాల్పడింది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యులేనని కోర్టు ఈ నెల 13వ తేదీన నిర్ధారించింది. అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఎర్‌ రెహమాన్‌ అలియాస్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోనూ, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లను నేరస్థులుగా నిర్ధారించి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది.

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: ఉరిశిక్ష వేయాలని.., ఏ శిక్ష ఐనా విధించుకోండి.. యాసిన్ భత్కల్దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: ఉరిశిక్ష వేయాలని.., ఏ శిక్ష ఐనా విధించుకోండి.. యాసిన్ భత్కల్

ఈ ఐదుగురు దోషులు హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర వంటి అభియోగాలకు సంబంధించి ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 307, 316, 318, 436, 466, 474, 201 రెడ్ విత్‌ 34, 109 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోనిసెక్షన్‌ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి.

yasin bhatkal

పాకిస్థాన్‌కు చెందిన వకాస్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14, 2 ఆఫ్‌ 3 కింద నేరం నిరూపణ అయింది. చర్లపల్లి జైలులోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

హైదరాబాదులో భద్రత కట్టుదిట్టం

యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఈ రోజు (సోమవారం) న్యాయస్థానం శిక్షను ఖరారు చేయడానికి ముందు హైదరాబాదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు నగరం మొత్తం భారీ ఎత్తున మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

సేల్స్‌బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్‌కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్..సేల్స్‌బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్‌కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్..

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో... రియాజ్ భత్కల్ ఏ1 నేరస్తుడు. ఇతను పరారీలో ఉన్నాడు. ఏ2 అసదుల్లా అక్తర్, ఏ3 జియాఉర్ రెహ్మాన్, ఏ4 మహ్మద్ తహసీన్ అక్తర్, ఏ5 యాసిన్ భత్కల్, ఏ6 ఎజాజ్ షేక్‌లు మిగతా నేరస్తులు.

English summary
NIA court to deliver judgement in dilsukhnagar bomb blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X