హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరీ సంగీత?: నైజీరియన్లతో లింకులు.. డ్రగ్స్ కేసులో కీలకంగా!

హైదరాబాద్‌లో మకాం పెట్టాక.. నైజీరియన్‌ ఒజుకు కాస్మోస్‌తో కలిసి రాజేంద్రనగర్ సన్ సిటీలోని ఓ అపార్ట్ మెంటులో అతనితో పాటు ఉంటోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధానిలో శాఖోపశాఖలుగా విస్తరించిన డ్రగ్స్ మహమ్మారిని పోలీసులు పెకిలించివేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 13మందిని పోలీసులు అరెస్టు చేయగా.. ఇందులో 'సంగీత' అనే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

నైజీరియన్‌ డ్రగ్‌ ముఠాతో సంగీతకు ఉన్న లింకులపై రాచకొండ పోలీసులు కూపీ లాగుతున్నారు. నైజీరియన్ల డ్రగ్స్‌ దందాకు సహకరిస్తూ.. వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి ఇచ్చినందుకు ఎల్బీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో సంగీతతో పాటు ముగ్గురు నైజీరియన్లను వారం రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఆఫ్రికన్లతోనే దోస్తీ:

ఆఫ్రికన్లతోనే దోస్తీ:

విజయవాడకు చెందిన సంగీతకు తొలి నుంచి ఆఫ్రికన్లతో దోస్తీ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లో వారితో పరిచయాలు పెంచుకుంది. అలా ఢిల్లీ వెళ్లి నైజీరియన్లతోనే పాటు అక్కడే ఉండిపోయింది.

మధ్యలో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చినా.. కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో.. మళ్లీ నైజీరియన్ల వద్దకే చేరింది. అయితే ఈసారి తన మకాంను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మార్చింది.

నైజీరియన్‌తో ఆ అపార్ట్‌మెంటులో:

నైజీరియన్‌తో ఆ అపార్ట్‌మెంటులో:

హైదరాబాద్‌లో మకాం పెట్టాక.. నైజీరియన్‌ ఒజుకు కాస్మోస్‌తో కలిసి రాజేంద్రనగర్ సన్ సిటీలోని ఓ అపార్ట్ మెంటులో అతనితో పాటు ఉంటోంది. ఒజుకు 2012లో ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా.. అతను అక్రమంగా ఇండియాలో ఉంటున్నాడు.

గాబ్రియెల్ అనే మరో నైజీరియన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఒజుకు దాన్ని నగరంలో విక్రయించేవాడు. ఈ దందాకు సంగీత సహకరించేది. ఆన్‌లైన్‌లో డబ్బు లావాదేవీల నిర్వహణ కోసం తన పేరిట ఖాతా తెరిచింది. డ్రగ్స్ తీసుకున్నవారు ఈ ఖాతాకే డబ్బు పంపించేవారు.

అలా డ్రగ్స్ కేసులో నైజీరియన్లతో కలిసి అక్రమాలకు పాల్పడిన సంగీతను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ విషయాలు వెలుగుచూశాయి.

గాబ్రియెల్ చిక్కితే:

గాబ్రియెల్ చిక్కితే:

డ్రగ్స్ సప్లయింగ్ లో కీలకంగా ఉన్న గాబ్రియెల్ చిక్కితే గానీ ఈ వ్యవహారంలో లోతైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గోవా, ముంబయికి చెందిన ముఠాలతో గాబ్రియెల్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి ముఠాలను ప్రశ్నించడం ద్వారా గాబ్రియెల్ ఆచూకీ పట్టుకోవాలని చూస్తున్నారు.

అజ్ఞాతంలోకి గాబ్రియెల్:

అజ్ఞాతంలోకి గాబ్రియెల్:

ఈస్ట్‌మారెడ్‌పల్లి పోలీసులకు 20 గ్రాముల కొకైన్‌ తో చిక్కిన కేసులో గాబ్రియెల్‌ను నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం బెయిల్ పైనే బయట ఉన్న అతను.. తాజాగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. డ్రగ్స్ కేసును సిట్ సీరియస్ గా తీసుకోవడంతో.. ఎవరికి దొరక్కుండా గాబ్రియెల్ ఎక్కడో తలదాచుకున్నాడు.

నిషేధిత మత్తుపదార్థాలు బ్రౌన్‌షుగర్‌, కొకైన్‌, ఎంపిటమైన్‌ వంటి వాటిని గాబ్రియెల్ సప్లయ్ చేసినట్లుగా తేలడంతో.. ఇతని వెనుక బడా గ్యాంగులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A Nigerian gang indulging in drug and human trafficking was busted by police in the city on last week. Police arrested six people, including five Nigerians and a woman from Vijayawada,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X