వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Night Curfew: నేటి నుండి విధింపు .. కరోనా ఉధృతి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు గా తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.

రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ

రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ

రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు గా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈరోజు రాత్రి నుండి ఏప్రిల్ 30 తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి 8 గంటల వరకు రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, షాపులకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎక్కడైనా షాప్ ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. రాత్రి వేళల్లో ప్రయాణించాలనుకునే వారికి ఎలాంటి ప్ర‌త్యేకమైన పాసులూ ఇవ్వ‌రు.. అంతర్-రాష్ట్ర రవాణాపై ఎటువంటి నిషేధం ఉండదు.

నైట్ కర్ఫ్యూలో మినహాయింపులు ఇవే

నైట్ కర్ఫ్యూలో మినహాయింపులు ఇవే

ఇక కర్ఫ్యూ నుండి ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ షాప్ లు, అత్యవసర సేవలను నిర్వర్తించే వారికి మినహాయింపు ఉంటుంది. నైట్ కర్ఫ్యూ లో భాగంగా పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది, మిలిటరీ లేదా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభిస్తుంది .మీడియా, ఆరోగ్యం, విద్యుత్ లేదా అగ్నిమాపక విభాగంలో పనిచేసే వారు తమ విధులను నిర్వర్తించడానికి రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి ,
గర్భిణీ స్త్రీలు మరియు వైద్య పరిస్థితులతో ఉన్నవారు కూడా ఆసుపత్రులకు లేదా వైద్య కేంద్రాలకు వెళ్లడానికి అనుమతించబడతారు.

కోర్టు అల్టిమేటం ఇవ్వటంతో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్

కోర్టు అల్టిమేటం ఇవ్వటంతో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్

కోవిడ్ నియంత్రణపై ఉదాసీనంగా వ్యవహరించిన తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్ అయింది , కరోనా కట్టడికి నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయడంతో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయం కరోనా కట్టడికి ఏ మేరకు పని చేస్తుందో తెలియాల్సి ఉంది . ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6 వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, 18 మంది మృతి చెందడం తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.

English summary
The Telangana government has taken a key decision in the wake of the corona epidemic boom in the state. The Telangana government has issued night curfew to control the corona. Night curfew will be enforced in Telangana from today. The night curfew will continue from tonight until April 30. The Telangana government has said that restaurants, pubs, clubs, bars and shops will be allowed till 8 pm and strict action will be taken if any shop is found open after that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X