హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాత్రి నరకం.. పగలు చుక్కలు.. అకాల గాలి, వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్న జనం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. రాత్రి జరిగిన విద్వంసానికి పగలు ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు చుక్కలు చూస్తున్నారు. రహదారుల వెంట పడిఉన్న చెట్లు, విద్యుత్ వైర్లతో ట్రాఫిక్ కు పూర్తిగా అంతరాయం కలిగి ప్రయాణం గంటల కొద్ది ఆలస్యం జరుగుతున్న ఉద్యోగస్తులు చెప్పుకొస్తున్నారు.

 నగరాన్ని వణికించిన ఈదురు గాలులు..! గంటకు 78 కి.మీ. వేగంతో అతలాకుతలం..!!

నగరాన్ని వణికించిన ఈదురు గాలులు..! గంటకు 78 కి.మీ. వేగంతో అతలాకుతలం..!!

రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్‌ అతలాకుతలం..! ఎల్బీ స్టేడియంలో టవర్‌ కూలి ఒకరు మృతి..!!

హైదరాబాద్‌ అతలాకుతలం..! ఎల్బీ స్టేడియంలో టవర్‌ కూలి ఒకరు మృతి..!!

జడివాన గ్రేటర్‌ హైదరాబాద్‌ను గజగజలాడించింది. విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వర్షం 2 సెంటీమీటర్ల లోపే కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు చేరాయి. దీంతో ఆ ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్, చార్మినార్‌లో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో కొద్ది గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మారేడ్‌పల్లి, అంబర్‌పేట్, రామకృష్ణమఠం, ఉప్పల్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్కాజ్‌గిరిలో వరదనీరు పోటెత్తింది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో పలు షెడ్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్‌ తీగలు తెగిపడి కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

నగర జన జీవనం అతలా కుతలం..! అకాల వర్షంతో అనేక సమస్యలు..!!

నగర జన జీవనం అతలా కుతలం..! అకాల వర్షంతో అనేక సమస్యలు..!!

ఈదురు గాలుల తీవ్రతకు ఎల్బీ స్టేడియంలోని భారీ ఫ్లడ్‌ లైటు టవర్‌ కుప్పకూలింది. అదే సమయంలో విధులు ముగించుకుని మెట్రో రైలు ఎక్కేందుకు స్టేడియం మీదుగా వెళ్తున్న యాభైఐదేళ్ల జీఎస్టీ ఉద్యోగి సుబ్రమణ్యం టవర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న తోటి ఉద్యోగి రమేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, స్పోర్ట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్, పోలీసు అధికారులు సందర్శించి సహాయచర్యలు చేపట్టారు.

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ముగ్గురు మృత్యువాత..! ఏందీ గోస అంటున్న బాదితులు..!!

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ముగ్గురు మృత్యువాత..! ఏందీ గోస అంటున్న బాదితులు..!!

వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ షెడ్‌ కూలిపోయింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరుగుతున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆదేశించారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.

English summary
Thunderstorms in the state created a devastating blow. Suddenly, the rain dropped a huge loss. The winds blew up at 78 km per hour on Monday afternoon. The winds were hampered by the people in Hyderabad and the districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X