• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Niharika Konidela : అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి న్యూసెన్స్‌పై నిహారిక భర్త రియాక్షన్... 10న ఖాళీ చేస్తున్నామని

|

మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై నమోదైన న్యూసెన్స్ ఫిర్యాదుపై ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చైతన్య అర్ధరాత్రి వేళ న్యూసెన్స్ చేశాడని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి.వివాదానికి కారణమైన ఫ్లాట్‌ను ఈ నెల 10 లోగా ఖాళీ చేస్తున్నట్లు చైతన్య వెల్లడించారు. దీంతో ఇక ఈ గొడవ సమసిపోయింది.

నిహారిక భర్త ఏమన్నారంటే...

నిహారిక భర్త ఏమన్నారంటే...


'అందరికీ నమస్కారం.. చాలా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి... దీనిపై నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నా... ఒక అపార్ట్‌మెంట్‌ను ప్రొడక్షన్ హౌస్‌ కోసమని అద్దెకు తీసుకున్నాం. అయితే అపార్ట్‌మెంట్ వాసులకు,యజమానికి మధ్య మిస్ కమ్యూనికేషన్ వల్ల సమస్య వచ్చింది. కమర్షియల్‌ అవసరాలకు అపార్ట్‌మెంట్ ఇవ్వమని చెప్పడంతో ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాం. అగస్టు 10న ఖాళీ చేస్తామని యజమానితో చెప్పాం. ఇదే క్రమంలో ఈ నెల 2న 25 మంది అపార్ట్‌మెంట్ వాసులు మా ఫ్లాట్‌కి వచ్చి గొడవపడ్డారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.' అని చైతన్య తెలిపారు.

అగస్టు 10న అపార్ట్‌మెంట్ ఖాళీ చేస్తున్నామని...

అగస్టు 10న అపార్ట్‌మెంట్ ఖాళీ చేస్తున్నామని...

మొదట తాను ఫిర్యాదు చేయగా... దానికి కౌంటర్‌గా అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేసినట్లు చైతన్య తెలిపారు. కానీ మీడియాలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా వార్తలు వచ్చాయన్నారు. బంజారాహిల్స్ పోలీసులు తమ ఇరువురిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు తనకు,నిహారికకు క్షమాపణలు చెప్పడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. అగస్టు 10న ఆ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి మరో చోటుకు వెళ్తున్నట్లు చెప్పారు.

అపార్ట్‌మెంట్ వాసులు ఏమంటున్నారు....

అపార్ట్‌మెంట్ వాసులు ఏమంటున్నారు....


అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీలు లేదని చెప్పామన్నారు. ఆఫీస్‌ కోసమని ఫ్లాట్‌ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని అన్నారు. పోలీసుల సమక్షంలో అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. అంతకుముందు,అపార్ట్‌మెంట్ వాసులు చేసిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు.నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు తరుచూ కొంతమంది యువకులు వస్తున్నారని... వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

భర్తకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన నిహారిక

భర్తకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన నిహారిక

బుధవారం(అగస్టు 4) నిహారిక కొణిదెల వీడియో ఒకటి యూట్యూబ్‌లో పోస్ట్ అయింది. తన స్నేహితుడి వీడియో చానెల్‌లో చేసిన ఓ సరదా వీడియోలో నిహారిక కనిపించారు. అందులో ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తన భర్త 31 బర్త్ డేకి 31 రోజుల ముందు 31 గిఫ్ట్‌లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఆ గిఫ్టులను మరిచిపోవద్దని.. ఒక లిస్టుగా రాసి.. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు తెలిపారు. తన బ్యాగ్‌లో ఎప్పుడూ శానిటైజర్,స్పెక్ట్స్,డెబిట్ కార్డ్స్,నెయిల్ కట్టింగ్ సెట్,డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డు,లిప్‌స్టిక్స్,పెన్ పెన్సిల్స్ ఉంటాయని చెప్పారు.

గతేడాది ఘనంగా పెళ్లి

గతేడాది ఘనంగా పెళ్లి

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారికకు,గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు గతేడాది డిసెంబర్ 9న వివాహం జరిగిన సంగతి తెలిసిందే.రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ఉదయ్ విలాస్‌ పెళ్లి వేదికగా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు సన్నిహితులు,పలువురు అతిథులు పాల్గొన్నారు. పెళ్లికి ముందు నిహారిక పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బుల్లితెరపై యాంకర్‌గానూ మెరిసింది. అయితే కెరీర్ ఆశించినంత స్థాయిలో ముందుకు సాగలేదు. ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపుగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ నిహారిక మెరిసిన సంగతి తెలిసిందే.

వెబ్ సిరీస్‌లో నటిస్తున్న నిహారిక...

వెబ్ సిరీస్‌లో నటిస్తున్న నిహారిక...

పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉండవచ్చుననే ప్రచారం సాగినప్పటికీ... ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది.భర్త, అత్త మామల నుంచి అనుమతి మేరకే నిహారిక మళ్లీ నటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఓ వెబ్‌సిరీస్‌‌లో ప్రస్తుతం నిహారిక నటిస్తోంది. నిహారికతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌ను రాయుడు చిత్రాలు అనే బ్యానర్‌పై భాను రాయుడు నిర్మిస్తున్నారు. యూట్యూబర్‌గా మంచి పేరున్న నిఖిల్‌ విజయేంద్ర నటిస్తున్నాడు. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు తాను చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని అప్పట్లో నిహారిక పేర్కొన్నారు.

సినిమాల్లోకి నిహారిక భర్త...?

నిహారిక భర్త చైతన్య కూడా సినిమా హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.బడా నిర్మాణ సంస్థతో చైతన్యను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వస్తున్నాడని చాలామంది భావించారు. కొంతకాలం వరకూ మెగా ఫ్యామిలీ ఎవరూ దీనిపై స్పందించకపోవడంతో సైలెంట్‌గా దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఓ సందర్భంలో నిహారిక దీనిపై స్పష్టతనిచ్చారు.తన భర్తకు సినిమాలు చూడటమే తప్ప నటనపై ఆసక్తి లేదన్నారు. నటన అనేది చిన్నప్పటి నుంచి ఎంతో కొంత ఫ్యాషన్ ఉంటేనే వస్తుందని... ఎదో సడన్‌గా ఇప్పటికిపుడే హీరోగా అనుకుంటే సరిపోదని చెప్పింది. నిహారిక క్లారిటీతో చైతన్యపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

English summary
Niharika Konidela husband Chaitanya Reaction- The two sides have reached a compromise on a Nuisance complaint lodged against Mega Daughter Niharika's husband Jonnalagadda Chaitanya. It is learned that the apartment members had lodged a complaint with the Banjara Hills police that Chaitanya had made nuisance in the midnight in an apartment in Shaik Pet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X