వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ మొదటివాడు కాడు: పదేళ్లలో తొమ్మిది మంది ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హెచ్‌సియు)లో వేముల రోహిత్‌దే మొదటి ఆత్మహత్య కాదు. గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వివక్షను తట్టుకోలేక గత పదేళ్ల కాలంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారంతా కింది కులాలకు చెందినవారే కావడం గమనార్హం.

ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎనిమిది దళిత విద్యార్థులే కావడాన్ని బట్టి కులవివక్షకు విశ్వవిద్యాలయం ఆలవాలంగా మారిన విషయాన్ని బయటపెడుతోందని దళిత, ప్రగతిశీల మేధావులు అంటున్నారు. దళితేతర విద్యార్థులు దళిత విద్యార్థులను ఈసడింపుతో, అమానవీయ దృష్టితో చూస్తారని, ఈ ఫ్యూడల్ ఆలోచనా ధోరణి మారకపోతే దేశం బాగుపడదని ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కేండియ కట్జు ఫేస్‌బుక్ వాల్ మీద రాశారు.

క్యాంపస్‌లో దళిత విద్యార్థుల పట్ల కుల వివక్ష కొనసాగుతుందనే మనస్తాపానికి గురై 2013లో ఎం. వెంకటేష్ అనే పిహెచ్‌డి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక వెనుకబాటుతనంతో విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అంటున్నారు. కష్టపడి ఫెలోషిప్‌లు సాధించుకున్నా డబ్బులు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు.

రోహిత్ విషయంలో అదే జరిగింది. రోహిత్ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఐడియాలజీని గురించి తెలుసుకొని, సోషల్‌ మీడియాలో దాన్ని ప్రచారం చేసేవాడు. ఇది కూడా రోహిత్‌ రీసెర్చ్‌ చేస్తున్న డిపార్ట్‌ మెంట్‌ ప్రొఫెసర్లకు మింగుడు పడలేదు. దీంతో డాక్టోరల్‌ కమిటీల పేరుతో రోహిత్‌ ఫెల్లోషి్‌పలకు సంతకాలు పెట్టకుండా వేధించారనే విమర్శలు ఉన్నాయి. వారు సంతకాలు చేస్తేనే ఫెలోఫిప్‌ డబ్బులు వస్తాయి. అలా గత యేడాదిన్నర కాలంగా రోహిత్‌ ఫెల్లోషిప్‌ ఆగిపోయింది.

Nine student suicides in 10 years

కోర్సులో బ్యాక్ లాగ్స్ ఉన్నాయనే కారణంతో ప్రొఫెసర్లు సంతకాలు పెట్టకపోవడంతో ఫెలోషిప్ ఆగిపోయింది. దీంతో 2008లో సెంథిల్ కుమార్ అనే పిహచ్‌డి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఫెలోషిప్ రూపంలో ఆర్థిక సాయం అందజేసే సౌకర్యం ఉన్నప్పటికీ డబ్బులు రావడంలో ఆలస్యం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే తమ పరిశోధనలకు స్వస్తి చెబుతున్నారని అంటున్నారు.

2008లో సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా, 2009లో కేశవాచారి అనే విద్యార్థి, రావుల బాలరాజు, 2011లో తేజావత్, 2013లో పుల్యాల రాజు, 2013లో ఎం వెంకటేష్ ఆత్మహత్యలు చేసుకున్నారు.

రామస్వామి వీసిగా ఉన్నప్పుడు..

గతంలో రామకృష్ణ రామస్వామి వీసీగా ఉన్నప్పుడు ముగ్గురు విద్యార్థులు రోహిత్ మాదిరిగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిర్ధారించిన విషయాలను, సూచించిన జాగ్రత్తలను పాటించకుండా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సూచనలను పాటించి ఉంటే, ఇవాళ రోహిత్‌ మరణించేవాడు కాదని కూడా అంటున్నారు.

గతంలో కూడా...

గతంలో కూడా పదిమంది దళితవిద్యార్థులను బహిష్కరించింది ఈ యూనివర్సిటీ యాజమాన్యం. అప్పుడు చీఫ్‌ వార్డన్‌గా ప్రస్తుత వీసీ అప్పారావే ఉన్నారు. ఈసారి ఆయన ఐదుగురుని సస్పెండ్‌ చేశారు. ఈ సస్పెన్షన్‌ కూడా ఇప్పటికీ గ్రామాల్లో జరిగే కుల బహిష్కరణలాంటిదనే అంటున్నారు.

English summary
ohith Vemula's isn't the first suicide by a Dalit student on the University of Hyderabad campus.Over the last decade a string of suicides have rocked the central varsity highlighting the pronounced discrimination against students from the marginalized sections at UoH, say progressive intellectuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X