• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్ బార్లు, పబ్‌లలో ప్రైవేటు సైన్యాలు.. కస్టమర్లను చితక్కొడుతున్న బౌన్సర్లు!(వీడియో)

|

హైదరాబాద్ పబ్బుల్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న పబ్ లో డాన్సర్ గా పనిచేస్తున్న యువతిని నడిరోడ్డు మీద వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేస్తే, ఇక తాజాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి పబ్ కి వెళ్లిన యువకులను బౌన్సర్లు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది.

నేడు ఢిల్లీ వెళ్లనున్న కోమటి రెడ్డి .. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ?

జూబ్లీహిల్స్ లో పబ్ లో ఘర్షణ .. యువకులను చితకబాదిన బౌన్సర్లు

జూబ్లీహిల్స్ లో పబ్ లో ఘర్షణ .. యువకులను చితకబాదిన బౌన్సర్లు

పబ్ లు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి అనే విషయం తాజాగా పబ్ లో డ్యాన్సర్ పై లైంగిక దాడికి యత్నం చేసిన ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. అంతే కాదు పబ్ లో బౌన్సర్ల నిర్వాకం తాజాగా జరిగిన ఘటనతో బయటకు వచ్చింది. పబ్ లో జరిగిన చిన్న సంఘటన చిలికిచిలికి గాలివానైంది. తొమ్మిది మంది యువకులు తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమైంది. బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి పబ్ కు వెళ్లిన యువకులు వాష్ రూమ్ కి వెళ్లిన క్రమంలో అక్కడ ఉన్న టిష్యూ పేపర్లు 4 జారి కింద పడ్డాయి. దీంతో ఏర్పడిన వివాదం బౌన్సర్ లకు యువకులకు మధ్య గొడవ గా మారింది. దీంతో పబ్ లోని బౌన్సర్లు యువకులను చితక బాదారు. బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 పుట్టినరోజు వేడుకలకు పబ్ కు వెళ్ళిన 9మంది స్నేహితులు .. టిష్యూ పేపర్లు కింద పడటమే ఘర్షణకు కారణం

పుట్టినరోజు వేడుకలకు పబ్ కు వెళ్ళిన 9మంది స్నేహితులు .. టిష్యూ పేపర్లు కింద పడటమే ఘర్షణకు కారణం

స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల కోసం కార్తీక్ రెడ్డి, నవీన్ శరత్చంద్ర, చంద్ర కిరణ్ రెడ్డి లు మరి కొందరు స్నేహితులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అమ్నీషియా పబ్ కి వెళ్లారు. ఇక వీరిలో కొందరు వాష్ రూమ్ కి వెళ్లిన సందర్భంలో టిష్యూ పేపర్ ను యూజ్ చేస్తుండగా కొన్ని టిష్యూ పేపర్లు కింద పడ్డాయి. ఇక దీన్ని గమనించిన బౌన్సర్లు ఆ యువకులను ప్రశ్నించారు. దీంతో యువకులకు బౌన్సర్లు మధ్య వాగ్వాదం జరిగింది.

బౌన్సర్లపై ఫిర్యాదు చేసిన యువకులు ... కేసు నమోదు

బౌన్సర్లపై ఫిర్యాదు చేసిన యువకులు ... కేసు నమోదు

అది కాస్తా పెద్దదై చివరకు బౌన్సర్లు అంతా కలిసి యువకులను చితక బాదిన పరిస్థితి వచ్చింది.తీవ్ర గాయాలపాలైన యువకులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువకులు పబ్ నిర్వాహకులపై, బౌన్సర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువకులు ఫిర్యాదు మేరకు పోలీసులు పబ్ యజమాన్యాన్ని ,బౌన్సర్లను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Nine youngsters were injured seriously when they were brutally attacked by the bouncers in Hyderabad. The incident took place at Amnesia Lounge Bar in JubileeHills on Sunday night. The injured victims later complained JubileeHills police by demanding action on the attackers. According to victims, the nine youngsters visited the pub on Sunday to celebrate one of their friends birthday party.When they went to washroom and to dry the hands pulled the napkin box. Four napkins fell on the floor, due to which argument raised between a bouncer and the youngsters. Immediately he called the other bouncers and attacked on them in which Karthik Reddy, Chandra kiran Reddy, Naveen and Sharath Chandra and others were seriously injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more