వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే చివరిది: పోలవరం ప్రాజెక్టుపై గడ్కరీ కీలక ప్రకటన, తెలంగాణకు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చట్టంలో ఇకపై జాతీయ ప్రాజెక్ట్ లు ఉండవు: గడ్కరీ

న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరమే చివరి ప్రాజెక్టు అని, ఇక మీదట రాష్ట్ర ప్రాజెక్టులకు జాతియ హోదా ఉండదని తేల్చి చెప్పారు. వీలైతే నిధుల్లో 60:40 శాతం నిష్పత్తిలో నిధులు ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన లోకసభలో స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రాజెక్టు ఒక్కటైనా చేపట్టాలని ఎంపీ వినోద్ కుమార్ లేఖ రాశారు.

చెడ్డవాళ్లం కాదు, ఇదీ నా భర్త, అలా చెయ్: భర్తను చంపిన నిందితుడికి కూచిభొట్ల భార్యచెడ్డవాళ్లం కాదు, ఇదీ నా భర్త, అలా చెయ్: భర్తను చంపిన నిందితుడికి కూచిభొట్ల భార్య

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని గడ్కరీ చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, భవిష్యత్తుల ఇక ఏ ప్రాజెక్టుకు అలాంటి హోదా ఉండదన్నారు. లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బెంగాలమ ఎంపీ సలీం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. గడ్కరీ ప్రకటనపై తెరాస ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెంటనే వినోద్ కుమార్ లేఖ

వెంటనే వినోద్ కుమార్ లేఖ

జాతీయ ప్రాజెక్టు విషయంలో ఆయన సమాధానం ఇస్తున్నంత సేపు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెరాస ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో ఎంపీ వినోద్ కుమార్ వెంటనే గడ్కరీకి లేఖ రాశారు. తెలంగాణ సీఎంతో పాటు తమ ఎంపీలు నాలుగేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారని, దీనిని విస్మరించరాదన్నారు. చట్ట ప్రకారం పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారని, అదే చట్టంలో పేర్కొన్న కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి ఇవ్వాలని కోరారు.

తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టామని ప్రభుత్వం సమర్థించుకోవచ్చని, కానీ తెలంగాణను కూడా పరిగణలోకి తీసుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారమే తెలంగాణ ఏర్పడినందున ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని తన లేఖలో కోరారు. కేంద్రం తగిన నిధులు కేటాయించకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరిలపై సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిందని, అందులో కనీసం ఒక్కప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు.

చట్టంలో ఉంది

చట్టంలో ఉంది

విభజన సమయంలో చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని, అందుకే దానిని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని పని చేస్తున్నామని, ఆ తర్వాత ఏ ప్రాజెక్టుకూ ప్రకటించకూడదని కేంద్రం నిర్ణయించిందని, కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు తొంబై శాతం కేంద్రం, పది శాతం రాష్ట్రాలు ఇస్తాయని చెప్పారు.

ఇక నుంచి ఈ నిష్పత్తి కిందకు

ఇక నుంచి ఈ నిష్పత్తి కిందకు

రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని గడ్కరీ చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదన్నారు. ఇక రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటే 60 శాతం, 40 శాతం నిష్పత్తి కిందకే వస్తాయని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఇలా నిధులు ఇస్తుందని చెప్పారు.

English summary
Union Minister Nitin Gadkari statement on Polavaram and National projects. TRS MP Vinod Kumar wrote a letter to Gadkari over his statment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X