హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ప్రిన్సిపాల్‌ను వదలని విద్యార్థులు, గదిలో వేసి తాళం వేసి మరీ ర్యాంగింగ్, రంగంలోకి పోలీసులు

|
Google Oneindia TeluguNews

ర్యాగింగ్ భూతం పీక్‌కి చేరుతోంది. ర్యాగింగ్‌పై నిషేధం ఉన్న కొందరు అల్లరి విద్యార్థులు జూనియర్లను వేధిస్తూనే ఉన్నారు. అదేదో మారుమూల ప్రాంతంలోనే, సిటీకి దూరంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున ర్యాగింగ్ జరిగింది. ర్యాగింగ్ వద్దు బాబు.. బుద్దిగా చదువుకోవాలని సూచిస్తే ప్రిన్సిపాల్‌ను కూడా వదల్లేదు. అతనికి తాము అంటే ఏంటో చూపించారు విద్యార్థులు.

నిజాం కాలేజీలో ర్యాగింగ్..

నిజాం కాలేజీలో ర్యాగింగ్..

హైదరాబాద్ నడిబొడ్డున గల నిజాం కాలేజీలో కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు. జూనియర్లను ఇబ్బందికి గురిచేస్తున్నారు. విషయం ఎలాగోలా తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ ఏంటి అని నిలదీశారు. ర్యాగింగ్ వద్దని తీరు మార్చుకోవాలని సూచించారు. పెద్దసారు చెబితే సరే అనేట్టు తల ఊపిని వారు.. వెనకాలే వెళ్లారు. ఆయన గదిలోకి వెళ్లారో లేదో తమ ప్రతాపం చూపించారు.

 తలుపేసి తాళం పెట్టి

తలుపేసి తాళం పెట్టి

ప్రిన్సిపాల్‌కు కూడా తమ ర్యాగింగ్ అంటే ఏంటో తెలియజేయాలని అనుకొన్నారు. గదిలో వేసి తలుపు గడియ పెట్టారు. అంతటితో ఊరుకోలేదు తాళం కూడా వేశారు దీంతో కొద్ది సేపు ఏం జరుగుతుందో అనే అంశంపై క్లారిటీ లేదు. విద్యార్థులు తనను కూడా ర్యాగింగ్ చేస్తున్నారని తెలుసుకున్నారు. తలుపు తీయమని చెప్పినా పట్టించుకోలేదు. అలా కాసేపు ప్రిన్సిపాల్ గదిలోపలే ఉండిపోయారు.

రంగంలోకి పోలీసులు

రంగంలోకి పోలీసులు

కాలేజీలో ర్యాగింగ్ గురించి మరికొందరు విద్యార్ధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రిన్సిపాల్‌ను బంధించిన గది వద్దకెళ్లి తాళం తీశారు. దీంతో ప్రిన్సిపాల్‌ కూడా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా అనుకొన్నారు. జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిపారు. వారు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పీఎస్‌కు తీసుకెళ్లారు. మంచిగా ఉండాలని చెప్పి.. వారిని పోలీసు స్టేషన్ నుంచి పంపించేశారు.

English summary
nizam college students ragging to principal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X