• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇవాంకా టూర్: 1883లోనే టెలిఫోన్, విద్యుత్, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రత్యేకతలివే!

By Narsimha
|

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌తో పాటు జీఈఎస్ 2017 సదస్సుకు హజరైన అతిథులకు ప్రధాన మంత్రి మోడీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనున్నారు. అయితే ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే ప్రధానమంత్రి విందును ఎందుకు ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్యాలెస్ ప్రత్యేకతలు ఏమిటో ఓసారి తెలుసుకొందాం.ప్రపంచంలోనే ఈ ప్యాలెస్‌కు అనేక ప్రత్యేకతలున్నాయని స్థానికులు చెబుతుంటారు.

రెండు చోట్లే ఇవాంకా టూర్, హెలికాప్టర్‌లోనే మోడీ పర్యటన, ఎందుకంటే?

జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌కు నవంబర్ 28వ, తేదిన వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె హైద్రాబాద్‌కు వస్తారు.

ప్రపంచంలోనే అతి పెద్ద టేబుల్‌పై ఇవాంకా డిన్నర్, ఫలక్‌నుమాలో ఏర్పాట్లు

హైద్రాబాద్‌లో రెండు చోట్ల మాత్రమే ఇవాంకా ట్రంప్ పర్యటన ఉంటుందని తెలంగాణ డీజీపీ మహేందర్ ‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి మోడీ పర్యటనను పురస్కరించుకొని హైద్రాబాద్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాంకా భోజనం: సెక్యూరిటీ రుచి చూశాకే, స్పెషల్ కిచెన్, మెడికల్ టీమ్

ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎంపిక చేయడం

ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎంపిక చేయడం

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రపంచ ప్రసిద్ది పొందిన ఏర్పాట్లు ఉన్నాయి. నిజాం నవాబులు ఈ ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా, విలాసవంతంగా నిర్మించారు. అత్యంత ధనికులు, ప్రముఖులు ఈ ప్యాలెస్‌లో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది పొందిన ఆటలకు ఉపయోగించిన వస్తువులు కూడ అతి ఖరీదైనవి. ఈ ప్యాలెస్ నిర్మాణానికి కూడ నిజాం నవాబులు చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. దీంతో ఈ ప్యాలెస్ ప్రఖ్యాతి చెందిందని చెబుతుంటారు.

 32 ఎకరాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్

32 ఎకరాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్

నిజాం నవాబుల కాలంలో నిర్మించిన కట్టడాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత వాస్తు నైపుణ్యంతో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ‘ఆకాశ దర్పణం' అని అర్థం.ఆరో నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో ఇతడి బావ.. సంస్థానం ప్రధాని అయిన పైగా వంశస్తుడు సర్‌ వికారుల్‌ ఉమ్రా (1893-1901) ఫలక్‌నుమాకు నిర్మాణానికి 1884 మార్చి 3న శంకుస్థాపన చేశారు.

 ఇటలీ నుండి పాలరాయి, ఇంగ్లాండ్‌ నుండి చెక్క

ఇటలీ నుండి పాలరాయి, ఇంగ్లాండ్‌ నుండి చెక్క

ఫలక్‌నుమా ప్యాలెస్ సగ భాగం నిర్మాణం పూర్తి కాగానే వికారుల్‌ కుటుంబం 1889 డిసెంబర్‌లో మారింది. అప్పటికి ప్రస్తుత ప్రధాన భవనం నిర్మాణం కానందున కుటుంబమంతా ‘గోల్‌ మహల్‌'లో ఉండి ప్రధాన ప్యాలెస్‌ను నిర్మించారు. మొత్తం భవనం 1893 నాటికి పూర్తయ్యాయి. ఇండో అరేబియన్, పర్శియన్, ఇటాలియన్‌ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. ఇందులో వాడిన పాలరాయిని ఇటాలీ నుంచి, చెక్కను ఇంగ్లాండ్‌ నుంచి తెచ్చారు. గోడలు, పైకప్పుపై ఫ్రెంచ్‌ కళాకారులతో అందమైన చిత్రాలు గీయించారు.

 తాజ్ గ్రూప్‌కు అద్దెకు

తాజ్ గ్రూప్‌కు అద్దెకు

ఏడో నిజాం అనంతరం అతడి మనవడు బర్కత్‌ అలీఖాన్‌ ముకరంజా ఆధీనంలోకి ప్యాలెస్ వచ్చింది. 1948 నుంచి ఈ ప్యాలెస్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ముకరంజా మొదటి భార్య అస్రా తాజ్‌ గ్రూప్‌నకు 30 ఏళ్ల పాటు అద్దెకిచ్చింది. తర్వాత హోటల్‌కు అనువుగా కొన్ని మార్పులు చేసి 2010 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ హోటల్‌లో ప్రధాన సూట్స్‌తో పాటు 60 గదులను వినియోగంలో ఉన్నాయి. స్పెషల్‌ బాత్, స్పా, హెల్త్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్, స్మోకింగ్‌ ఏరియా, ఇటాలియన్‌ రెస్టారెంట్‌తో పాటు హైదరాబాద్‌ స్పెషల్‌ (ఆదా) రెస్టారెంట్‌ ఉన్నాయి. నిజాం ఉపయోగించిన టేబుళ్లు, కుర్చీలు అతిథులకు అందుబాటులోకి తెచ్చారు.

101 డైనింగ్ హల్

101 డైనింగ్ హల్

ఆరో నిజాం సంస్థానానికి 1898లో వచ్చిన ఐదో కింగ్‌జార్జి ఆడ్వర్డ్‌ పరివారానికి విందు ఇచ్చేందుకు ప్యాలెస్‌లో 101 అతిపెద్ద డైనింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి ఇటాలియన్‌ ఫర్నిచర్‌తో 33 మీటర్ల పొడవుండే ఈ డైనింగ్‌ హాల్‌ దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటిది. నిజాం ఈ డైనింగ్‌ హాల్‌లోనే తన బంధువులు, కుటుంబ సభ్యులు, బ్రిటీష్‌ ప్రధాన అధికారులు విందు చేసేవారు. ప్రస్తుతం ఈ టేబుల్‌పై విందు చేయాలంటే ఒక్కొక్కరికీ రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

 లండన్ నుండి స్నూకర్, ఇటలీ నుండి చెస్

లండన్ నుండి స్నూకర్, ఇటలీ నుండి చెస్

లండన్‌ నుంచి తెప్పించిన స్నూకర్‌తో పాటు ఇటలీ నుంచి తెప్పించిన చెస్‌ గేమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. బంగారు, వెండి తీగలతో రూపొందించిన హుక్కాను సైతం అతిథులకు అందిస్తున్నారు. ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్‌ కాయిన్స్‌ ఉన్నాయి. ప్యాలెస్‌లోని బిలియర్డ్స్‌ టేబుల్‌ చాలా అరుదైనది. ఇలాంటిది ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్‌ లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌లోను, మరొకటి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మాత్రమే ఉంది.

 1883లోనే విద్యుత్, టెలిఫోన్ వినియోగం

1883లోనే విద్యుత్, టెలిఫోన్ వినియోగం

1883లోనే ఈ భవనంలో విద్యుత్, టెలిఫోన్‌ వినియోగించారు. భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్‌ బోర్డు ఇక్కడ ఉంది.

ఈ భవనానికి విద్యుత్తు అందించేందుకు ఆరోజుల్లో బొగ్గు యంత్రాలను ఉపయోగించేవారు. యంత్రాలున్న ప్రాంతాన్ని 'ఇంజన్‌ బౌలి' అనేవారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఇదే పేరుతో పిలుస్తున్నారు.

 నిజాం సూట్ ప్రత్యేకతలు

నిజాం సూట్ ప్రత్యేకతలు

ప్యాలెస్‌లో అన్నింటి కంటే ఖరీదైనది నిజాం సూట్‌. దీని అద్దె రోజుకు రూ.5 లక్షలు. ప్యాలెస్‌లో 204 నంబర్‌గా కేటాయించారు. ఈ సూట్‌లో నిజాం ఉపయోగించిన వస్తువులు ఉంటాయి. ఈ సూట్‌ నుంచి జంట నగరాల అందాలను తిలకించవచ్చు. ఇంకా అక్బర్‌ సూట్, షాజాది సూట్‌ వంటి దాదాపు 60 సూట్‌ రూంలున్నాయి. వీటి అద్దె రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది.

English summary
Flowers from Bangkok in Thailand, Indonesia and Bengaluru, chefs from different Taj Hotels across the country at the rate of one chef for each dish as well as gold and silver plates, cutlery are being readied for Ivanka Trump's dinner at Taj Falaknuma Palace. The Nizam suite in the former residence of the Nizam and other royal suites are being kept on standby in case Ivanka, PM Modi or other VVIP guests want to use them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more