• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి సంచలనం .. స్ట్రాంగ్ రూమ్లకు సొంత తాళాలు వేసే అవకాశం కావాలట

|

నిజామాబాద్ ఎంపీ స్థానం ... దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది . దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్థానంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది . ఇక ఈ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ సిఈవో ను కలిసి పోలింగ్ పై పలు అనుమానాలను , అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన పోలింగ్ శాతం పెరిగిన విషయం పై ఆయనతో చర్చించామని ,కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ మిషన్ ని మళ్ళీ కౌంట్ చేయాలని చెప్పామని అన్నారు.

పోలింగ్ పై అనుమానాలపై ఆర్టీఐ సమాచారం కోరిన అరవింద్

పోలింగ్ పై అనుమానాలపై ఆర్టీఐ సమాచారం కోరిన అరవింద్

కొన్ని మిషన్లు స్ట్రాంగ్ రూమ్ కి రావడం లో ఆలస్యం అయ్యిందని పేర్కొన్న అరవింద్ స్ట్రాంగ్ రూంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు .మా ప్రతినిధులను మేము కావాలని సెక్యూరిటి పెట్టుకుంటామని చెప్పామని కూడా ఆయన తెలిపారు .అయితే సిఈవో కొంత పరిధిలో పెట్టుకోవచ్చు అని సీఈఓ చెప్పారని తెలిపారు. కేంద్ర బలగాలు ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదని చెప్పారన్న అరవింద్ ఉపయోగం లేని ఈవీఎంలు సీజ్ చేస్తామని మీరు కూడా రావాలని మాకు కలెక్టర్ ఫోన్లు చేస్తున్నారన్నారు .

48 గంటల తరువాత ఉపయోగం లేని ఈవీఎంలు ఎందుకు బయట ఉన్నాయో.సీఈఓ కి తెలియజేశామని చెప్పారు . వీటి అన్నింటిపై ఆర్టీఐ ద్వారా వివరాలు అందిస్తామని సిఈవో స్పష్టం చేశారు.నిజమాబాద్ లో 6 గంటల వరకు పోలింగ్ సాగింది దానిపై పోలింగ్ శాతం కరెక్ట్ గా రాలేదు. అందుకే సరైన వివరాలు అందిస్తామని తెలియజేసారు.

ఆర్టీఐ కింద దాఖలు చేసిన లేఖలో అరవింద్ కోరిన వివరాలివి

ఆర్టీఐ కింద దాఖలు చేసిన లేఖలో అరవింద్ కోరిన వివరాలివి

బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆర్టీఐ కింద దాఖలు చేసిన లేఖలో మొన్న జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎలెక్షన్ లో పోలింగ్ కేంద్రాల్లో వచ్చిన ఓటర్ల సంఖ్య కి పోలైన ఓట్ల సంఖ్య కి విపరీతమైన వత్యాసం ఉండడం వలన సమాచార హక్కు చట్టం కింద ఈ కింది సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ను కోరడమైనది:

1 ) నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోలింగ్ నాడు , ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటర్ చే సంతకం లేదా వేలి ముద్ర చేయబడిన రిజిస్టర్డ్ ఓటరు లిస్టు .(ఫారం 17A )

2 ) అన్ని పోలింగ్ స్టేషన్ లలో రికార్డ్ చేయబడిన ఓట్లు (ఫారం 17C ).

3 ) ప్రతి పోలింగ్ స్టేషన్ లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ యొక్క సర్టిఫైడ్ కాపీ.

4 ) క్లోజ్ బటన్ డిస్ ప్లే ప్యానల్ , స్క్రీన్ షాట్ కనుక సేవ్ చేయబడి ఉంటె ,ఆ వివరాలు మరియు ప్రతి పోలింగ్ స్టేషన్ లో క్లోజ్ బటన్ నొక్కిన సమయం.EVM మరియు VVPAT మెషీన్లు సీలు చేసిన సమయాలు

5 )ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ జరిగిన మొత్తం సమయం .

6 )EVM మరియు VVPAT లు స్ట్రాంగ్ రూమ్ లకు ఏ సమయం లో చేరాయో , ఆ వివరాలు కోరుతూ దరఖాస్తు చేశారు . ఇక ఆర్టీఐ ద్వారా దాఖలు చేసిన ఈ దరఖాస్తుకు రాష్ట్ర ఎన్నికల అధికారి సమాధానం ఇవ్వాల్సి ఉంది .

స్ట్రాంగ్ రూమ్ కు సొంతగా తాళం వేసుకునే అవకాశం కల్పించాలని కోరిన అరవింద్

స్ట్రాంగ్ రూమ్ కు సొంతగా తాళం వేసుకునే అవకాశం కల్పించాలని కోరిన అరవింద్

అంతే కాకుండా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మ పురి అరవింద్ లేఖ రాశాడు . ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు భద్ర పరచిన స్ట్రాంగ్ రూమ్ కు సొంతగా తాళం వేసుకునే అవకాశం కల్పించాలని కోరారు .ఈవీఎంలు తారుమారు చేసే అనుమానం ఉందటున్న బీజేపీ నేత అరవింద్ అలా జరగకుండా ఉండాలనే తాను లేఖ రాసినట్టు చెప్తున్నారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ లేఖను రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపే యోచనలో జిల్లా ఎన్నికల అధికారులు ఉన్నారు. అయితే సొంత తాళాలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు . ఎందుకంటే ఈ ఒక్క స్థానంలో అనుమతి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అడిగే అవకాశం ఉంటుంది . కాబట్టి సొంత తాళాలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు .

English summary
BJP parliament candidate Dharma Puri Aravind wrote a letter to District Election Returning Officer. The BJP leader Arvind, who is suspected of manipulating EVMs, says that he has written a letter. and he asked the election officer to lock with their own locks to the strong rooms .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X