నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. కవిత వైపే ఏకపక్ష ఓటింగ్ .. 99.64 శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయినట్టు తెలుస్తుంది. పిపిఈ కిట్లు ధరించి మరీ కరోనా పేషెంట్లు ఓట్లు వేశారు .మొత్తం 824 ఓట్లకు 823 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటరు మరణించడంతో 99.64% పోలింగ్ నమోదయినట్లు గా అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ ల తర్వాత బోధన్ మున్సిపాలిటీ కి చెందిన 18 వ వార్డు కౌన్సిలర్ గుణశేఖర్ మృతిచెందాడు. ఆ ఒక్క ఓటు మినహాయించి మిగతా అన్ని ఓట్లు పోలయ్యాయి.

సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? క్యాబినెట్ లో కవితకు స్థానం ? చర్చ షురూ !!సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు దసరాకు గిఫ్ట్ ఇవ్వనున్నారా ? క్యాబినెట్ లో కవితకు స్థానం ? చర్చ షురూ !!

కవిత మంత్రి అవ్వటం ఖాయం అంటూ గులాబీ నేతల ధీమా

కవిత మంత్రి అవ్వటం ఖాయం అంటూ గులాబీ నేతల ధీమా

ఊహించినట్లే ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. మెజార్టీ స్ధానిక సంస్ధల సభ్యులు అధికార పార్టీకి జై కొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బోధన్ లో పర్యటించి ఓటింగ్ సరళి పరిశీలించారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం, భీంగల్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్ ఎక్స్ అఫీషియో హోదాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన ఎమ్మెల్యేలు కవిత మంత్రి అవ్వడం ఖాయమని, జిల్లాకు పూర్వ వైభవం రాబోతుందని ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటేశారు. 824 మంది ఓటర్లు 50 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.వార్ వన్ సైడ్ జరిగిందని, కవిత గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యేలు చెప్పారు.

 కోవిడ్ నిబంధనల మేరకే సాగిన పోలింగ్

కోవిడ్ నిబంధనల మేరకే సాగిన పోలింగ్

నిజామాబాద్- కామారెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు పోలింగ్ పక్రియ ప్రారంభం కాగా ప్రత్యేక క్యాంపుల్లో ఉన్న ఓటర్లు నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు తమ తమ పరిధిలోని స్ధానిక సంస్ధల ఓటర్లను దగ్గరుండి ఓటు వేయించారు. కోవిడ్ నిబంధల ప్రకారం పోలింగ్ పక్రియ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 63 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతుగా ఎంఐఎం కార్పొరేటర్లు ఓటేశారు.

దొడ్డిదారిలో కవిత వస్తున్నారని బీజేపీ ఎంపీ ఫైర్

దొడ్డిదారిలో కవిత వస్తున్నారని బీజేపీ ఎంపీ ఫైర్

స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎంపీ అర్వింద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ కార్పొరేటర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకసారి ప్రజలు తిరస్కరించినా మళ్లీ దొడ్డిదారిలో వచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. జిల్లాకు పట్టిన జిడ్డును వదిలించుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

Recommended Video

Nizamabad Local Body MLC Elections: TPCC President Uttam Kumar Reddy Slams CM KCR
బీజేపీ నేతల ఆందోళన .. కవిత ఎన్నిక ఏకపక్షమే

బీజేపీ నేతల ఆందోళన .. కవిత ఎన్నిక ఏకపక్షమే

అంతకు ముందు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు కొద్ది సేపు ఆందోళన చేశారు. అధికార పార్టీ నేతలు గెస్ట్ హౌజ్ లో గుంపులుగా ఉన్నా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొత్తానికి బీజేపీ నేతల ఆందోళన మినహాయించి పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది . ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని తెలుస్తుంది. ఈనెల 12న రెండు రౌండ్ల కౌంటింగ్ లో ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు . అయితే మెజార్టీ అధికార టీఆర్ఎస్ కు ఉండటంతో కవిత ఎన్నిక లాంచనప్రాయంగా మారింది.

English summary
Nizamabad local body MLC By- elections ended peacefully. 99.64 per cent polling was recorded in this election. Many corona patients cast their votes wearing PPE kits .There were 823 votes out of a total of 824. With the death of one voter, 99.64% polling was recorded, officials said. The results of the counting of votes will be announced at Nizamabad Polytechnic College on the 12th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X