నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌ల్వ‌కుంట్ల క‌వితః మార్చి 1, న్యూఢిల్లీ..!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ః నిజామాబాద్ లోక్ స‌భ స‌భ్యురాలు కల్వకుంట్ల కవిత మ‌రో అరుదైన గౌర‌వాన్ని అందుకున్నారు. లింగ స‌మాన‌త్వం అంశంపై ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్వ‌హించ‌బోయే స‌ద‌స్సులో ఆమె ప్ర‌సంగించ‌బోతున్నారు. ఈ త‌ర‌హా స‌ద‌స్సులో పాల్గొని, ప్ర‌సంగించబోయే తొలి తెలంగాణ మ‌హిళా లోక్ స‌భ స‌భ్యురాలు క‌వితే కావ‌డం విశేషం. మార్చి 1వ తేద‌న ఏర్పాటు కానున్న‌ ఈ స‌ద‌స్సుకు దేశ రాజ‌ధాని వేదికైంది.

యునైటెడ్ నేష‌న్స్ గ్లోబ‌ల్ కాంపాక్ట్, గ్లోబ‌ల్ నెట్ వ‌ర్క్ ఇండియా సంయుక్తగా ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌బోతున్నాయి. లింగ స‌మాన‌త్వం అనే అంశంపై క‌విత ప్ర‌సంగిస్తారు. ఉపాధి, నైపుణ్య రంగాల్లో మ‌హిళ‌లు పురోగ‌మించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకోవాల్సిన అంశాల‌పై చ‌ర్చిస్తారు. ఉపాధి క‌ల్ప‌న దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా దేశంలోని ఇత‌ర రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లను ఆమె ఈ స‌ద‌స్సులో ప్ర‌స్తావిస్తారు.

Nizamabad MP Kalvakuntla Kavitha to be chief speaker at UN summit

దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఆమె తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి తెప్పించుకుంటున్నారు. క్రియేటివిటీ, శాస్త్రీయ‌బ‌ద్ధ‌మైన ఆలోచ‌న‌ల‌తో మ‌హిళ‌ల‌కు క‌ల్పించాల్సిన ఉపాధి అవ‌కాశాల‌తో పాటు, వారు ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువుల మార్కెటింగ్‌, లింగ స‌మాన‌త్వం వంటి అంశాలు ఈ స‌ద‌స్సులో చ‌ర్చ‌కు రానున్నాయి. పారిశ్రామిక విప్లవం, వ్యాపార రంగంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌డం, ఆటోమేషన్, బిగ్ డేటా, దేశంలో యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాలపై జీఈఎస్ 2019లో చర్చిస్తారు. బ‌హుళ జాతి సంస్థ డెలాయిట్ ఈ స‌ద‌స్సుకు నాలెడ్జ్ పార్ట్ న‌ర్‌గా ప‌నిచేస్తోంది.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha will be chief speaker at the Gender Equality Summit 2019 (GES 2019), organised by Global Compact Network India’s (GCNI), a local arm of the United Nations Global Compact. It will be held in Delhi on March 1, 2019. The theme for the meeting will be ‘Preparing Women for the Future of Work’.Kavitha has been selected for the summit as chief speaker for her “thoughtful leadership and passion to accelerate efforts to achieve Sustainable Development Goals (SDG), especially Gender Equality in India”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X