హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో 'కవిత'చే టీ జాగృతి శాఖ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర పునర్‌నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ జాగృతి తాజాగా ఉత్తర అమెరికాశాఖను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అమెరికా డెట్రాయిట్‌లోని ఫార్మింగ్‌టన్ హిల్స్ మేనర్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరై శాఖను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అమెరికాలోని తెలంగాణ జాగృతి ఇటు తెలంగాణ సమాజానికి అటు అమెరికాలోని ప్రవాస భారతీయ సమాజానికి వారధిగ నిలవాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు ఉన్న అనేకానేక తెలంగాణ సంస్థలను సమనవయ పరుస్తూ ముందు నిలవాలన్నారు. అమెరికాలోని తెలుగు సంస్థలు అందమైన పూలైతే వాటితో పేర్చిన అందమైన బతుకమ్మ జాగృతి అమెరికా శాఖ అన్నారు.

ప్రవాస తెలుగు సంఘాలైన డెట్రాయిట్ తెలంగాణ కమ్యునిటీ, తానా, ఆటా, నాటా, నాట్స్ , తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు శ్రీమతి కవిత గారిని సన్మానించారు. ఈ సందర్భంగా కవిత ఉత్తర అమెరికా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

కార్యవర్గంలో శ్రీధర్ బండారు, సుమంత్ గరకరాజుల, మురళి బొమ్మనవేని, నర్సింగ్‌రాజ్ గౌలికర్, కిరణ్ గుంటిక, బిందులత, వెంకట్ మంథెన ఉన్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ప్రవాస తెలుగు సంఘాలైన డెట్రాయిట్ తెలంగాణ కమ్యునిటీ, తానా, ఆటా, నాటా, నాట్స్ , తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు శ్రీమతి కవిత గారిని సన్మానించారు. ఈ సందర్భంగా కవిత ఉత్తర అమెరికా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

 ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత

కార్యవర్గంలో శ్రీధర్ బండారు, సుమంత్ గరకరాజుల, మురళి బొమ్మనవేని, నర్సింగ్‌రాజ్ గౌలికర్, కిరణ్ గుంటిక, బిందులత, వెంకట్ మంథెన ఉన్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

English summary
Nizamabad MP Kavitha launched telangana Jagruthi - north america unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X