• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సునీల్‌కు ఎంపీ కవిత దన్ను.. ప్రశాంత్‌కు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం.. ఇదీ బాల్కొండలో భగ్గుమన్న విభేదాలు

By Swetha Basvababu
|

హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రమంగా అసమ్మతి స్వరాలు బయట పడుతున్నాయి. ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లాలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. జిల్లా రాజధాని నిజామాబాద్ రూరల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఆధిపత్య పోరు ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు దారి తీస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు ఒక్క రూరల్‌ నియోజకవర్గానికే పరిమితం కాలేదు.

అదే జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గ పోరు ఇటీవల తారాస్థాయికి చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌రెడ్డి మధ్య నెలకొన్న వ్యవహారం నువ్వా..నేనా అన్నట్లుగా తయారైంది.

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మద్దతు ఉంటే.. ముత్యాల సునీల్ రెడ్డికి తెలంగాణ జాగ్రుతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దన్ను లభిస్తున్నది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎవరికి వారే వేర్వేరుగా టీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ప్రశాంత్‌కు మంత్రి హోదా

మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ప్రశాంత్‌కు మంత్రి హోదా

బాల్కొండలో పట్టునిలుపుకునేందుకు ప్రశాంత్ రెడ్డి, సునీల్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దృష్టి సారించగా, సేవా కార్యక్రమాలను సునీల్‌రెడ్డి ముమ్మరం చేస్తున్నారు. గ్రామాల్లో పరామర్శలు, శుభ కార్యాలకు హాజరవుతున్నారు. భీంగల్‌ మండలం బెజ్జోర గ్రామపంచాయతీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్‌రెడ్డి అనుచరుడిని గెలిపించుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. ఇలా ఇక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ కూడా రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తోంది. కాగా సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రశాంత్‌రెడ్డికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చిన అధినేత కేసీఆర్‌ ప్రశాంత్‌రెడ్డి విషయంలో మంత్రితో సమానంగా ప్రొటోకాల్‌ పాటించాలని ఆదేశించారు.

 వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని సునీల్ రెడ్డి ఇలా..

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని సునీల్ రెడ్డి ఇలా..

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షునిగా చాలా కాలం పనిచేసిన సునీల్‌రెడ్డి నిజామాబాద్‌ ఎంపీ కవితకు ప్రధాన అనుచరుల్లో ఒకరు. పార్టీలో చెప్పుకోదగిన పదవులేవీ లేకపోయినా సునీల్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుచరులతో స్పష్టం చేస్తున్నారు. భూపతిరెడ్డి సస్పెన్షన్‌ నేపథ్యంలో బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇద్దరు ముఖ్య నేతలు వేర్వేరుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చర్చకు దారితీస్తోంది.

బాల్కొండలోనూ ‘నిజామాబాద్ రూరల్' విభేదాలు

బాల్కొండలోనూ ‘నిజామాబాద్ రూరల్' విభేదాలు

బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మధ్య వర్గ పోరు కూడా సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. సునీల్‌రెడ్డి తీరుపై ప్రశాంత్‌రెడ్డి పలుసార్లు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశంలోనూ బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని వర్గపోరుపై స్వల్ప చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే దాదాపు ఇక్కడ కూడా నెలకొనడం ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.

English summary
Gradually TRS leaders facing internal struggle. It has exposed in recently Nizamabad rural MLA Bajireddy Govardhan and MLC Bhupati Reddy. Same situation Balkonda. In this Special twist here. Mission Bhagiratha Vice chairman Vemula Prasant Reddy has support from CM KCR while Sunil Reddy get support from Nizamabad MP Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X